Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలి... కోర్టుకెక్కిన యువకుడు

బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలి... కోర్టుకెక్కిన యువకుడు
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (18:35 IST)
అమెరికాలో ఓ యువకుడు బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలంటూ కోర్టుకెక్కి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. కరోనా ఓ వైపు, అధ్యక్ష ఎన్నికలు మరోవైపు అమెరికాలో ప్రజలను తికమకపెడుతుంటే.. బోన్ లెస్ చికెన్ పేరు మార్చాలని ఓ యువకుడు కోర్టును ఆశ్రయించాడు. 
 
బోన్‌లెస్ చికెన్ వింగ్స్‌ను నిషేధించాలని క్రిస్టెన్సన్ అభ్యర్థించాడు. బోన్‌లెస్ చికెన్ వింగ్స్ అనేవి చికెన్ వింగ్స్ నుంచి రావని, అది బ్రెస్ట్ ప్రాంతం నుంచి వస్తుందని, కాబట్టి అందులో బోన్స్‌ ఉండే అవకాశం లేదని పేర్కొన్నాడు. 
 
మనం చాలా కాలంగా అబద్ధాల్లో బతికేస్తున్నామని, కాబట్టి బోన్‌లెస్ చికెన్ పేరు మార్చాలని కోరారు. బోన్‌లెస్ చికెన్ పేరును 'బఫెలో స్టైల్ చికెన్ టెండర్స్, వెట్ టెండర్స్, సాసీ నగ్స్, ట్రాష్' వంటి వాటిలో ఏదో ఒక పేరు పెట్టాలని క్రిస్టెన్సన్ కౌన్సిల్‌ను అభ్యర్థించాడు. సోమవారం లింకన్ సిటీ కౌన్సిల్ సమావేశంలో అండర్ క్రిస్టెన్సేన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం పిల్లలు కొన్ని పదాలకు అర్థాలకు తెలియకుండానే వాడుతున్నారని తెలిపాడు. 
 
మన పిల్లలకు ప్రతీ విషయం అర్థం చేసుకునేలా పెంచుకోవాలి. మా పిల్లలు తమ మాంసానికి ఎముకలు జతచేయబడతాయనే భయంతో పెరిగారు. మాంసం ఎక్కడ నుండి వస్తుంది. ఇది ఎముకల మీద పెరుగుతుంది. కోడి రెక్క కోడి నుండి వచ్చినదని, అది రుచికరమైనదనేది పిల్లలకు వారికి నేర్పించాల్సిన అవసరం ఉందని క్రిస్టెన్సేన్ అనే యువకుడు మాట్లాడాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య.. చితిపై దూకిన ప్రియుడు....