Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య.. చితిపై దూకిన ప్రియుడు....

Advertiesment
Tamil Nadu
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:21 IST)
తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ యవతి బలవన్మరణానికి పాల్పడింది. తన తండ్రి స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ యువతిని అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గాఢంగా ప్రేమిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తన ప్రియురాలి మరణవార్త తెలుసుకున్న ప్రియుడు తల్లడిల్లిపోయాడు. చివరకు ఆ యువతిని దహనం చేస్తుంటే.. ఉన్నట్టుండి ఆ ప్రియుడు కూడా చితి మంటల్లో దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విలుపురం జిల్లా ఉళుందూరుపేట్టైకు చెందిన నిత్యశ్రీ అనే యువతి డిగ్రీ చదువుతోంది. అయితే, కరోనా వైరస్ కారణంగా కాలేజీ మూతపడివున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. 
 
తన అన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వాలని తండ్రిని అడిగింది. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో స్మార్ట్ ఫోనును కొనివ్వలేక పోయాడు. దీంతో నిత్యశ్రీ మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుంది. ఈ వార్త తెలుసుకున్న ప్రియుడు రాము వెంటనే నిత్యశ్రీ అంత్యక్రియలు జరుగుతున్న శ్మశాన వాటికకు వెళ్లి... అందరూ చూస్తుండగానే ఆమె చితిపై దూకి ఆత్మాహుతి చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇతర రాష్ట్రాలలో జెఈఈ, నీట్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఓయో ప్రత్యేక రాయితీలు