Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

Advertiesment

సెల్వి

, మంగళవారం, 18 నవంబరు 2025 (20:53 IST)
అమెరికాలో 15 సంవత్సరాలకు పైగా పనిచేసిన భారతీయ-అమెరికన్ టెక్నాలజీ ప్రొఫెషనల్, కాగ్నిజెంట్ నుండి తొలగించబడిన తర్వాత ఇప్పుడు ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోనాల్డ్ నేతావత్ అనే వ్యక్తి ఉబెర్ డ్రైవర్ కథను ఎక్స్‌లో పంచుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు రోనాల్డ్ నేతావత్, ఉద్యోగం నుండి తొలగించబడిన తర్వాత ఉబెర్ క్యాబ్ సర్వీస్ నడుపుతున్న భారతీయ సంతతికి చెందిన యుఎస్ పౌరుడు స్టోరీని పంచుకున్నారు. 
 
నేతావత్ ఉబెర్ రైడ్ బుక్ చేసుకున్నప్పుడు షాక్ అయ్యాడు. అతనిని తీసుకెళ్లడానికి ఒక అందమైన టెస్లాతో వచ్చాడు ఆ వ్యక్తి. ఉబెర్ డ్రైవర్‌తో సంభాషణ ప్రారంభించినప్పుడు, 40 ఏళ్ల చివరలో ఉన్న డ్రైవర్, తాను భారతీయుడినని.. 20 సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చానని వెల్లడించాడు. 
 
డ్రైవర్ నేతావత్‌తో తాను టెక్ పరిశ్రమలో మంచి కెరీర్‌ను నిర్మించుకున్నానని, కానీ ఇటీవల కాగ్నిజెంట్ తనను తొలగించిందని, దీంతో క్యాబ్ నడపాల్సి వచ్చిందని చెప్పాడు. ఆంటిమ్ ల్యాబ్స్‌లో ఉన్నత పదవిని అలంకరించిన  ఓనాల్డ్ నేతావత్, తనను పికప్ చేసుకోవడానికి వచ్చిన ఉబెర్ డ్రైవర్ కథను ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. 
 
నేతావత్ ప్రకారం, ఆ డ్రైవర్‌కు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో 25 సంవత్సరాల అనుభవం ఉంది.
 
 పేరు తెలియని ఆ భారతీయ డ్రైవర్ 2007లో H-1B వీసాపై అమెరికాకు వచ్చాడు. ఇక్కడ అతను వెరిజోన్, ఆపిల్ వంటి అనేక పెద్ద కంపెనీలలో పనిచేశాడు, ఒక ఐటీ కంపెనీకి సీటీఓ అయ్యాడు. 
 
ఆ దేశంలో 15 సంవత్సరాలు గడిపిన తర్వాత అతను అమెరకా పౌరసత్వం కూడా పొందాడు. కానీ కాగ్నిజెంట్ ఆ వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగించడంతో అతని జీవితం తీవ్ర మలుపు తిరిగింది. అతను క్యాబ్ నడపవలసి వచ్చింది.
 
మరొక ఉద్యోగం కోసం వెతకడానికి బదులుగా, ఆ భారతీయ-అమెరికన్ వ్యక్తి క్యాబ్ నడపాలని నిర్ణయించుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2 కోట్ల షాపర్స్‌కు చేరిన అమేజాన్ క్రియేటర్ ప్రోగ్రామ్స్