Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బికినీ ధరించి ఈతకొట్టింది..

Advertiesment
Ice cold water
, గురువారం, 7 మార్చి 2019 (14:22 IST)
సాధారణంగా ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదైతే, చలి తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు అందుకు తగు జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటాం. అయితే కజికిస్థాన్ దేశానికి చెందిన ఓ యువతి మాత్రం మంచు గడ్డలా ఉన్న కాస్పియన్ సముద్రంలో బికినీ ధరించి మరీ ఈత కొట్టింది. అది కూడా మైనస్ 17 డిగ్రీల చలిలో వినడానికే వింతగా ఉన్నా నిజమండీ బాబూ. 
 
జరీనా ఆండ్రీవుషీనా అనే యువతి కాస్పియన్ సముద్రపు తూర్పు తీరంలో గల అక్టవు అనే ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె ఇంటి నుండి సముద్రానికి చేరుకోవడానికి 5 నిమిషాలు మాత్రమే పడుతుందట. అందుకే ఎంత చలిగా ఉన్నా సరే గత రెండేళ్లుగా ఇలానే స్విమ్ చేస్తోందట. కాగా తాను అలా బికినీలో ఈత కొడుతున్నప్పుడు తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తను పోస్ట్ చేసింది. అంతేకాదు ఆరోజు ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ ఉందంట. మంచు గడ్డల మధ్యలో ఈతకొట్టడం ఒక ప్రత్యేకానుభూతిని కలిగిస్తోంది అంటూ పేర్కొంది. కాగా జరీనా సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.
 
ఉదయాన్నే జాగింగ్ చేసిన తర్వాత ఐస్-వాటర్‌లో మునగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, తనను ఆరోగ్యవంతమైన వ్యక్తిగా మార్చిందంటూ 33 సంవత్సరాలు వయస్సు ఉన్న ఓ మహిళ తెలిపింది. అయితే ఇలాంటి వ్యాయామం రష్యా మరియు దాని పరిసర దేశాల్లో బాగా జనాదరణ పొందినవి అంటూ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో రూ.20 నాణెం.. రూ.10 కాయిన్ చెల్లుతుందా? లేదా?