Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముళ్లపొదలో మహిళ వేషంలో అతడు.. కోరిక తీరలేదని.. చంపేశాడు..

Advertiesment
ముళ్లపొదలో మహిళ వేషంలో అతడు.. కోరిక తీరలేదని.. చంపేశాడు..
, గురువారం, 7 మార్చి 2019 (12:26 IST)
కోరిక తీరలేదని పురుషుడిని హత్య చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. గత నెలలో ఊరికి దూరంగా ముళ్లపొదల్లో పడి ఉన్న ఓ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కేసు విచారణలో భాగంగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 
 
మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి మహిళ వేషధారణలో విటులను ఆకర్షించడమే ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అతడు వేసిన ట్రాప్‌లో ఎవరైనా పడ్డారంటే ఇక అంతే సంగతులు. వారిని ఎలాగోలా బెదిరించి వారి దగ్గర నుండి డబ్బులు గుంజేసేవాడు. 
 
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని మహిళ వేషధారణతో ఆకర్షించి మోసం చేసాడు. ఆగ్రహంతో ఉన్న ఆ వ్యక్తి మహిళ వేషంలో ఉన్న అతడిని రాయితో బలంగా కొట్టాడు. ఆ తర్వాత చూన్నీతో అతడి గొంతు నులిమి చంపేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లోరిడా పోలీసులు చేసిన తప్పుకు ఎన్నారైకు శిక్ష... ఎలా?