Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌జిలీలో చైతు, స‌మంత‌ల పాత్ర‌లు ఇవే.!

Advertiesment
మ‌జిలీలో చైతు, స‌మంత‌ల పాత్ర‌లు ఇవే.!
, బుధవారం, 6 మార్చి 2019 (20:08 IST)
అక్కినేని నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ సమంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌జిలీ`. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌మంత‌తో పాటు దివ్యాంశిక కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.
 
సినిమా గురించి ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మాట్లాడుతూ .. సినిమా చూసే ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయ్యే మ‌ధ్య త‌ర‌గ‌తి భ‌ర్త‌గా ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య పూర్ణ‌ అనే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ఈయ‌న పాత్ర ఇన్‌టెన్స్‌గా, వైవిధ్యంగా ఉంటుంది. అలాగే స‌మంత అక్కినేని శ్రావ‌ణి అనే అమ్మాయిగా క‌న‌ప‌డుతుంది. ఈమె త‌న న‌ట‌న‌తో న‌వ్విస్తుంది, ఏడిపిస్తుంది. సినిమాను వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో చిత్రీక‌రించాం. 
 
ఇదొక ఎమోష‌నల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. సినిమాలో న‌టించిన మ‌రో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందన్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు ఎనిమిది మిలియ‌న్ వ్యూస్‌తో ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది. ఈ సినిమా పై చైతు, స‌మంత చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి... మ‌జిలీ ఎలాంటి రిజెల్ట్ ఇస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్‌ని ఆక‌ట్టుకున్న‌ అర్జున్ సురవరం టీజర్...