Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

Advertiesment
court

ఠాగూర్

, బుధవారం, 14 మే 2025 (16:21 IST)
రాత్రి నిద్రలోకి జారుకునే ముందు తాగే టీలో నిద్రమాత్రలు కలిపి అపస్మారకస్థితిలోకి వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం చేస్తున్న దారుణం ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ లైంగికదాడిని ఫోటోలు తీసిన భర్త, మానసికంగా వేధించేవాడు. తొలుత ఈ కేసు ఉపసంహరించుకున్నా.. తిరిగి బాధితురాలు పోరాటం చేసింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో భర్తకు 11 యేళ్ల జైలుశిక్షతో పాటు జీవితకాలం దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. 
 
యూకేలో జరిగింది. బాధితురాలు వెల్లడించిన వివరాల మేరకు... తనకు మత్తుమందు ఇచ్చి, అపస్మారకస్థితిలోకి జారుకున్న తర్వాత అత్యాచారానికి పాల్పడంతో పాటు ఆ దారుణాన్ని ఫోటోలు కూడా తీసి బెదిరింపులకు పాల్పడటంతో పాటు మానసికంగా, శారీరకంగా హింసించసాగాడు. అతని ప్రవర్తన చాలా నియంత్రణ ధోరణితో, హింసాత్మకంగా ఉండేదని, తరచూ వైద్యులు సిఫార్సు చేసిన మందులను దుర్వినియోగం చేసేవాడని ఆమె పేర్కొంది. ఒకనొక రోజు రాత్రి  భర్త తనకు ఇచ్చే టీలో నిద్రమాత్రలు కలపడం ప్రారంభించాడు. ఆమె గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ఆమెపై లైంగికదాడి పాల్పడి, ఆ దృశ్యాలను ఫోటోలు తీసేవాడు. 
 
కొన్నిసార్లు తనను తెలియకుండానే జరుగుతున్న లైంగిక చర్యల మధ్యలో మెళకువ వచ్చేదని, దాని గురించి ప్రశ్నిస్తే తాను నిద్రలో ఉన్నానని, అనారోగ్యంతో ఉన్నానని చెప్పి, భర్త తప్పించుకునేవాడని కేట్ పోయింది. అయితే, కొంతకాలం తర్వాత తన భర్త ఈ నేరాలన్నింటినీ ఆమె ముందు అంగీకరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ప్రాధేయపడ్డాడని తెలిపింది. ఆ సమయంలో తీవ్రమైన మానసిక క్షోభకు గురైన కేట్ దాదాపు యేడాది పాటు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని తెలిపింది. ఈ కేసును విచారించిన కోర్టు ముద్దాయికి జైలుశిక్ష విధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల