Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019గా గ్రేటా థన్‌బర్గ్

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019గా గ్రేటా థన్‌బర్గ్
, గురువారం, 12 డిశెంబరు 2019 (11:58 IST)
స్వీడిష్ స్కూల్ గర్ల్ గ్రేటా థన్‌బర్గ్.. క్లైమేట్ ఛేంజ్ ఉద్యమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ నేపథ్యంలో గ్రేటాకు అరుదైన గౌరవం దక్కింది. టైమ్స్ మ్యాగజైన్ గ్రేటాను పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. 1927వ సంవత్సరం ప్రారంభమైన ఈ అవార్డును అతి పిన్న వయస్సులో గెలుచుకున్న వ్యక్తిగా గ్రేటా నిలిచింది. 
 
గత ఏడాది, గ్రేటా స్వీడన్ పార్లమెంట్ భవనం వెలుపల నిరసన తెలిపింది. శుక్రవారాలు పాఠశాలకు దూరమై పర్యావరణ సమ్మెను ప్రారంభించింది. ఇది #FridaysForFuture అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రాచుర్యం పొంది ప్రపంచవ్యాప్త ఉద్యమానికి నాంది పలికింది. అప్పటి నుండి, వాతావరణ మార్పులపై చర్య కోసం ఆమె బలమైన గొంతుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నిరసనలలో పాల్గొనడానికి మిలియన్ల మంది విద్యార్థులను ప్రేరేపించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆమె నోబెల్ శాంతి బహుమతికి అభ్యర్థిగా ఎంపికైంది.
 
సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన యుఎన్ క్లైమేట్ కాన్ఫరెన్స్‌లో, వాతావరణ మార్పులకు సమాధానాల కోసం యువతపై ఆధారపడినందుకు రాజకీయ నాయకులను ఆమె ఏకిపారేసిన సంగతి తెలిసిందే. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా గ్రేటా ప్రశ్నించింది. యుఎస్ వాతావరణ చట్టాలను వెనక్కి తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆమె ఒకప్పుడు "దయగల, కాని సమాచారం లేని టీనేజర్" అని పిలువబడింది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష