Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మమ్మల్ని మోసం చేస్తారా? మీకెంత ధైర్యం? దేశాధినేతలను కడిగేసిన గ్రేటా థండర్ (Video)

Advertiesment
మమ్మల్ని మోసం చేస్తారా? మీకెంత ధైర్యం? దేశాధినేతలను కడిగేసిన గ్రేటా థండర్ (Video)
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (15:53 IST)
ఐక్య‌రాజ్య‌స‌మితిలో 16 ఏళ్ల బాలిక గ్రేటా థండర్ బర్గ్.. ప్రపంచ దేశాలకు చెందిన దేశాధినేతలను కడిగిపారేశారు. పర్యావరణ పరిరక్షణలో తగిన చర్యలు తీసుకోవడంలో దేశాధినేతలు విఫలమవుతున్నారని 16ఏళ్ల బాలిక ఆరోపించారు. పర్యావరణాన్ని కాపాడటంలో వెనకడుగు వేయడంపై ''హౌ డేర్ యూ'' అంటూ కడిగేసింది. నేటిత‌రం నేత‌లు యువ‌తను మోసం చేస్తున్నార‌ని ఆమె ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.
 
పర్యావరణ హక్కుల కోసం ఉద్యమిస్తున్న బాల కార్యకర్త గ్రేటా థండర్‌బర్గ్ ఐక్య‌రాజ్య‌స‌మితిలో జ‌రుగుతున్న సదస్సులో మాట్లాడుతూ.. ప్రపంచ దేశ నాయకులు తనలాంటి కొత్త తరానికి ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కలల్ని, తన బాల్యాన్ని వట్టి మాటలతో దొంగలించారు. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. పర్యావరణ వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయని ఏకిపారేశారు.
 
హాయిగా చదువుకోవాల్సిన తాను.. మీ నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే ఇక్కడికి వచ్చానని మండిపడ్డారు. మ‌నమంతా సామూహిక వినాశ‌నం ముందు ఉన్నామ‌ని గ్రేటా థండర్ బర్గ్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ''మీ ప్ర‌యోజ‌నాల కోసం మ‌మ్మల్ని మోసం చేస్తారా.. మీకెంత ధైర్యం" అంటూ గ్రేటా థండ‌ర్‌బ‌ర్గ్ ఊగిపోయింది. 
 
అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాల నేతల వైఖరికి సరిలేదని భావోద్వేగానికి లోనవుతూ తన ప్రసంగాన్ని ముగించింది. ప్రస్తుతం గ్రేటా థండర్ బర్గ్ స్పీచ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను లైకులు, షేర్లు చేసే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లి రేట్లు సెంచరీ కొట్టేందుకు వెళ్తుంటే.. దొంగలు అలా ఎత్తుకెళ్లిపోయారు..