Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పర్యావరణ పరిరక్షణపై ''గ్రేటా'' ఉద్యమం.. ఐరాసలో అదరగొట్టింది.. ఇకనైనా మారుతారా?

పర్యావరణ పరిరక్షణపై ''గ్రేటా'' ఉద్యమం.. ఐరాసలో అదరగొట్టింది.. ఇకనైనా మారుతారా?
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (18:30 IST)
అది వేసవిలో ఒక రోజు. 15 ఏళ్ల వయస్సులో ఆమె స్వీడెన్ పార్లమెంట్ వెలుపల కూర్చుంది. అనూహ్యంగా ప్రపంచ ఉద్యమానికి నాంది పలికింది. గత ఆగస్టులో స్వీడెన్ పార్లమెంట్ భవనం వెలుపల పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ ఉద్యమంలో ఆమెకు ఎవరూ తోడుగా నిలవలేదు. ఆమె పేరు గ్రేటా థండర్. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెను నిరాకరించేందుకు ప్రయత్నించారు. 
 
క్లాస్‌మేట్స్ కూడా ఆమెకు పక్కనబెట్టారు. 15ఏళ్ల యువతి పర్యావరణ పరిరక్షణ కోసం చేతిలో బ్యానర్‌తో రాతిపై కూర్చుని ఉద్యమం చేస్తుంటే చాలామంది జాలిపడ్డారు. ఎనిమిది నెలలు గడిచినా ఆమెలో పోరాటం ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఆమె పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ మోడల్‌గా మారిపోయింది. జాతీయ అధ్యక్షులు, కార్పొరేట్ అధికారులు ఆమెను విమర్శించారు. స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ అనే బ్యానర్‌తో ఆమె చేపట్టిన ఉద్యమం.. డజన్ల కొద్దీ భాషల్లోకి అనువదించబడి.. అలా వైరల్ అయ్యింది. 
webdunia
 
ప్రతి శుక్రవారం ఈ ఉద్యమానికి ఆమె ఒకతే వుంటుంది. ఆపై ఆ ఉద్యమానికి ఊపు వచ్చింది. గ్రేటా తల్లి మలేనా ఎర్నామన్. ఈమె స్వీడెన్ ఒపెరా గాయని. ఆమె తండ్రి, స్వంటే థన్‌బెర్గ్, ఒక నటుడు, రచయిత. నాలుగేళ్ల క్రితం గ్రేటా ఆస్పర్గర్‌తో ఇబ్బంది పడింది. పర్యావరణంపై పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన అంశాలే గ్రేటా గుర్తుండిపోయాయి. సముద్రంలో ప్లాస్టిక్ చిత్రాలను చూపించి.. పర్యావరణంపై మక్కువ అవసరమని చెప్పిన టీచర్ల మాటలు గ్రేటా మదిలో నాటుకుపోయాయి. 
 
అలాంటి సన్నివేశాలు చూసినప్పుడు గ్రేటా మనస్సు ఆందోళనతో నిండిపోయేది. బోరున ఏడ్చేది. ఎనిమిది సంవత్సరాల వయస్సులో, వాతావరణ మార్పుల గురించి ఆమె మొదట తెలుసుకున్నప్పుడు, పెద్దలు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించడం లేదని ఆమె షాక్ అయ్యింది. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై ఆలోచిస్తూ గ్రేటా ఉద్యమానికి తెరలేపింది. 
 
పాఠశాలకు వెళ్లడం మానేసింది. ఆపై తల్లిదండ్రులు కూడా ఆమెకు మద్దతు పలికారు. వాతావరణ సంక్షోభం, పర్యావరణం గురించి గ్రేటా ఉద్యమానికి తల్లిదండ్రుల పూర్తి మద్దతు కూడా లభించింది. వాతావరణ సమ్మెను ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్ పాఠశాల విద్యార్థులు ప్రేరేపించారు. 
 
మొదటి రోజు 20 ఆగస్టు 2018. ''నేను చెక్క ముక్క మీద గుర్తును చిత్రించాను. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను భావించిన కొన్ని వాస్తవాలను రాశాను. ఆపై నేను నా బైక్‌ను పార్లమెంటుకు తీసుకెళ్లి అక్కడే కూర్చున్నాను'' అని గ్రేటా ఆ రోజును గుర్తుచేసుకుంది. ''మొదటి రోజు, నేను ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒంటరిగా కూర్చున్నాను - సాధారణ పాఠశాల. ఆపై రెండవ రోజు, ప్రజలు నాతో చేరడం ప్రారంభించారు. ఆ తరువాత, అక్కడ ప్రజలు ఉన్నారు. 
webdunia
 
ఇలా స్వీడిష్ జాతీయ ఎన్నికల వరకు ప్రతీరోజూ సమ్మె చేసింది. తర్వాత పీపుల్స్ క్లైమేట్ అంశంపై మార్చిలో ర్యాలీలో పాల్గొని ప్రసంగం చేసింది. అయినా గ్రేటా తల్లిదండ్రుల్లో అయిష్టత కొనసాగుతూనే వున్నది. ఆమె కుటుంబ ఆందోళనలు ఉన్నప్పటికీ, తన నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. ఆమెకు సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. 
 
అలా పర్యావరణంపై ఆమె చేస్తున్న పోరాటం నేడు ఐరాస సభ వరకు వచ్చింది. నేడు ఆమె ఐరాస వేదికగా ప్రపంచ దేశాల నేతలను కడిగిపారేసింది. పర్యావరణంపై దేశాలు తిరుగుతూ.. వాతావరణ సంక్షోభానికి తెరపడేలా చేయాలని ప్రచారం చేస్తోంది. ఇందుకు గాను ఆమెకు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం అందజేయాలని డిమాండ్ కూడా పెరుగుతోంది. 
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరీక్షలో తప్పినా సంతోషమే...