Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సక్సెస్ స్టోరీ.....

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సక్సెస్ స్టోరీ.....
, శనివారం, 6 జులై 2019 (13:23 IST)
2014 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన కేబినెట్ లోకి నిర్మలా సీతారామన్‌ను తీసుకున్నారు. అప్పుడు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ మూడేళ్ళు తిరిగేసరికి 2017 నాటికి అత్యంత క్లిష్టమైన రక్షణాశాఖా మంత్రిగా ఆమెను నియమించడంతో ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే ఇందిరాగాంధీ తరువాత రక్షణ బాధ్యతలు చేపట్టిన మహిళ నిర్మలా సీతారామనే. 
 
కీలకమైన ఆ పదవిలో అలంకారప్రాయంలా ఉండాలనుకోలేదు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే రంగంలోకి దిగారు. ఎన్నో సవాళ్ళను చిరునవ్వుతో అధిగమించారు. భారత సైన్యానికి బాసటగా నిలిచారు. యుద్థ విమానాల్లో సైతం ప్రయాణించి తన సాహసాన్ని ప్రపంచానికి చాటారు.
 
మహిళలకు అవకాశాలు ఇస్తే అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలరని ఆమె నిరూపించారు. నిజం చెప్పాలంటే కెరీర్లో పట్టుదలగా ప్రతిభావంతంగా పూర్తి చేసిన ట్రాక్ రికార్డ్ నిర్మలా సీతారామన్ సొంతం. అందుకే ఈసారి ఏకంగా ఆమెకు కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు మోడీ.
 
పార్లమెంటు చరిత్రలో ఇప్పటిదాకా ఓ మహిళ పూర్తిస్థాయిలో ఆర్థికమంత్రిగా చేపట్టిన రికార్డ్ నిర్మలా సీతారామన్‌కు దక్కింది. తమిళనాడులోని మధురైలో పుట్టిపెరిగిన నిర్మలా సీతారామన్‌కు చిన్నప్పటి నుంచే ఆర్థిక వ్యవహారాల్లో ఆసక్తి ఉండేది. 1950లలో ఆమె సీతాస్వామి, రంగస్వామి కాలేజ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తరువాత డిల్లీ జెఎన్‌టియులో మాస్టర్స్, ఎంఫిల్ చేశారు. ఇండో యూరప్ అంశంపై పిహెచ్‌డి కూడా చేయాలనుకున్నారు. కానీ అప్పటికే ఆమె భర్త పరకాల ప్రభాకర్‌కు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో స్కాలర్ రావడంతో పిహెచ్‌డి పూర్తి చేయకుండానే ఆయనతో పాటు లండన్ వెళ్ళారు.
 
అక్కడ సీతారామన్ తొలుత ఒక స్టోర్లో సేల్స్ పర్సన్‌గా మొదలుపెట్టారు కెరీర్. జైట్లీని ఆమె తన రాజకీయ గురువుగా చూస్తారు. ఆరోగ్య సమస్యల వల్ల ఈసారి ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు జైట్లీ ఇష్టపడకపోవడంతో ఆ అవకాశం సీతారామన్‌కు దక్కింది. గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్‌కు చాలా ప్రాముఖ్యం ఉందంటున్నాయి బిజినెస్ వర్గాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తానా సభలో పవన్ కళ్యాణ్... ఖుషీ నుంచి గబ్బర్ సింగ్ వరకూ ఆగానంటూ...