Emmanuel Macron_Angela Merkel
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వాగత పలకరింపుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరోనాకు ముందు విదేశీ పలకరింపుల్లో కరచాలనం, ఆలింగనం తప్పనిసరిగా ఉండేవి. కానీ ప్రస్తుతం సీన్ మారింది. ప్రస్తుతం భారత దేశంతో పాటు విదేశీయులు కూడా చక్కగా చేతులు జోడించి నమస్కారం, నమస్తే అంటూ స్వాగతం పలుకుతున్నారు.
ఈ క్రమంలో జర్మనీ చాన్సలర్ ఏంజెల్ మార్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగని నమస్తే స్వాగత పలకరింపుకు సంబంధించిన ఫోటోలు, వీడియో తెగ వైరలవుతున్నాయి.
కరోనా మహమ్మారి, బెలారస్‌లో ఎన్నికల అనంతరం తలెత్తిన అశాంతి, టర్కీతో పెరుగుతున్న ఉద్రిక్తతలతో సహా పలు విషయాల గురించి చర్చించడానికి ఇరువురు నాయకులు ఫ్రెంచ్ అధ్యక్షుడి వేసవికాల విడిదిలో సమావేశమవుతున్నారు. ఆ సమయంలో ఇలా ఒకరికొకరు నమస్తే చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.