Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నమస్తే ట్రంప్ బిగ్ ఈవెంట్.. సర్దార్ వల్లభాయ్ స్టేడియం ముస్తాబు (Video)

నమస్తే ట్రంప్ బిగ్ ఈవెంట్.. సర్దార్ వల్లభాయ్ స్టేడియం ముస్తాబు (Video)
, సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (13:11 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దంపతులు సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 23కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆశ్రమానికి నిమిషాల వ్యవధిలోనే చేరుకున్నారు ట్రంప్ దంపతులు. దారి పొడవునా ట్రంప్‌కు స్వాగతం పలికారు గుజరాత్ వాసులు. ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ట్రంప్, గాంధీజీ ఫొటోకు పూలమాల వేసి నమస్కరించుకున్నారు.
 
ఆశ్రమం లోపల కలియదిరిగే సమయంలో మోడీ ఆయనకు అప్పటి పరిస్థితులను వివరించారు. కాగా-అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభ భాయ్ క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరిట బిగ్ ఈవెంట్ జరగనుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ఈ కార్యక్రమం పట్ల ట్రంప్ ఎంతో ఆసక్తి చూపవచ్ఛునని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. ఉభయ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కాస్త దెబ్బ తిన్న నేపథ్యంలో.. ట్రంప్ రాక మళ్ళీ వీటిని పునరుజ్జీవింపజేయవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఒక అత్యంత ప్రధానమైన వాణిజ్య ఒప్పందం కుదరవచ్చునని మొదట వార్తలు వచ్చాయి. 
 
కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి ఆ అవకాశాలు లేవని కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. వచ్చే నవంబరులో తమ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ ఒప్పందానికి తాము అంత ప్రాధాన్యం ఇవ్వడంలేదని, ఆ ఎన్నికల ప్రక్రియ ముగిశాకే తాము ఈ డీల్ కుదుర్చుకునే అవకాశం ఉందని ప్రకటించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో పెట్టుబడి.. భారతీయ కంపెనీల సీఈవోలతో ట్రంప్