Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కెనడా నేలపై కెనడా పౌరుడి హత్య వెనుక భారత్ హస్తం.. మరోమారు స్పందించిన జస్టిన్ ట్రూడో

Justin Trudeau
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (13:33 IST)
Justin Trudeau
కెనడా నేలపై కెనడా పౌరుడు హత్య వెనుక భారత్ హస్తం ఉందనేందుకు విశ్వసనీయ కారణాలు ఉన్నాయని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖలీస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్లు ఉన్నారంటూ ఆయన ఇటీవల ప్రకటించారు. దీంతో భారత్ కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 
 
ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వేనుకు భారత ఏజెంట్ల హస్తం ఉందనేందుకు విశ్వసనీయ కారణాలు ఉన్నాయని, చట్టబద్ధమైన అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అందువల్ల కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఐక్యరాజ్యసమితిలోని కెనడా కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు.
 
'సోమవారం నేను చెప్పినట్టు కెనడా నేలపై కెనడా పౌరుడి హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందనేందుకు విశ్వసనీయ కారణాలు ఉన్నాయి. ఇది అత్యంత కీలకమైన వ్యవహారం. చట్టసభల వేదికగా నేను ఈ అంశాన్ని ప్రస్తావించాను. ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. అంతర్జాతీయంగా తన పలుకుబడి, ప్రాధాన్యత పెంచుకుంటున్న దేశం భారత్ అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. భారత్ కెనడా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అంశంలో పూర్తి పారదర్శకత దిశగా మాతో కలిసి పనిచేయాలని కోరుతున్నాం' అని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
 
అదేసమయంలో తమది చట్టబద్ద పాలన ఉన్న దేశమని ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పుకొచ్చారు. తమ విలువలు పరిరక్షించుకునేందుకు, దేశ పౌరులను కాపాడుకునేందుకు, అంతర్జాతీయంగా చట్టబద్ధ సంబంధాలు నెలకొల్పేందుకు తాము కృషి చేస్తామన్నారు. ఇతర దేశాల్లోని పౌరుల హత్యతో మరో దేశానికి ప్రమేయం ఉండటం అస్సలు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధాని మోడీతో కూడా తాను చర్చించినట్టు చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా బాధ.. నా ఆవేదన.. నా ఆక్రందన... జైల్లో ఉంచి మానసికక్షోభకు గురిచేస్తున్నారు : చంద్రబాబు