Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొడవలు లేకుండా జీవించడం నరకంలా వుంది.. అతి ప్రేమతో చచ్చిపోతున్నా.. విడాకులుకావాలి!

Advertiesment
గొడవలు లేకుండా జీవించడం నరకంలా వుంది.. అతి ప్రేమతో చచ్చిపోతున్నా.. విడాకులుకావాలి!
, శుక్రవారం, 23 ఆగస్టు 2019 (17:46 IST)
నా భర్తతో గొడవలు లేకుండా జీవించడం నాకు ఒక నరకంగా ఉంది. ఇలాంటి జీవితం నాకు వద్దు. నా భర్త చూపించే అతి ప్రేమతో చచ్చిపోతున్నా.. అలాంటి అతిప్రేమ నాకు వద్దు.. ప్లీజ్ నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఆ మహిళ వేడుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, అరబ్ దేశాల్లో ఒకటైన యూఏఈలోని షరియత్ కోర్టుకు ఒక విడాకుల కేసు వచ్చింది. ఆ కేసు వివరాలను చదివిన జడ్జి ఆశ్చర్యపోయారు. తన భర్త అతి మంచితనం వల్ల తాను సరిగా కాపురం చేయలేకపోతున్నానని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ భార్య కోరింది. తాను చెప్పిన పనేకాక చెప్పని పని కూడా చేస్తూ విసుగు తెప్పిస్తున్నాడంటూ భర్తపై ఆరోపణలు చేసింది. 
 
దాంతో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని జడ్జి ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ, 'అసలు నా భర్త ఏ విషయంలోనూ నాతో గొడవపడడు. ఇంటిని సరిగా ఉంచకపోయినా, వంట బాగా చేయకపోయినా ఏమి అనడు. పైగా అప్పడప్పుడు తనే నాకు వండి పెడుతుంటాడు. ఇంటిని కూడా శుభ్రం చేస్తాడు, అంట్లు కడుగుతాడు, బట్టలు కూడా తానే వాషింగ్ మెషిన్లో వేసి ఆరేస్తాడు. నాకు పనేం చెప్పకపోగా బహుమతులతో నన్ను ముంచెత్తుతాడు. నాకు మా ఆయనతో గొడవ పడాలని, వాదించాలని ఉంటుంది. కానీ నేనేం చేసినా సరే తను ప్రేమతో క్షమిస్తూ ఉంటాడు. ఆయన అతి ప్రేమతో నాకు ఊపిరాడటం లేదు. అసలు గొడవలు లేకుండా జీవించడం నాకు నరకంలా ఉంది. ఇలాంటి జీవితం నాకు వద్దు. విడాకులు ఇప్పించండి' అంటూ ప్రాధేయపడింది. 
 
దీనికి ఆమె భర్త కూడా సమాధానం ఇచ్చాడు. తన భార్యంటే తనకు అమితమైన ఇష్టమని, ఆమెను కష్టపెట్టడం తనకు ఏమాత్రం ఇష్టంలేదని బదులిచ్చాడు. తనతో నేను గొడవ పడలేనని అన్నాడు. గతంలో ఒక సారి తన భార్య తనను బరువు తగ్గమని చెప్పిందని.. వెంటనే కఠినమైన డైట్ ఫాలో అయి సన్నగా అయ్యానని చెప్పుకొచ్చాడు. భార్యతో గొడవపడటం తన వల్ల కాదని సదరు భర్త తేల్చి చెప్పాడు. వీరిద్దరి వాదనలు విన్న జడ్జి.. ఇది కోర్టులో విచారించదగిన కేసు కాదని.. దంపతులిద్దరూ కలసి కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచన చేస్తూ, కేసు విచారణను వాయిదా వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిదంబరం అరెస్టు: మరింత మంది విపక్ష నేతలకు ఇదే పరిస్థితి రావొచ్చు, ఎందుకంటే?