Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నగ్నంగా వున్నారు.. దిగిపోవాల్సిందే.. ఎక్కడ?

Advertiesment
నగ్నంగా వున్నారు.. దిగిపోవాల్సిందే.. ఎక్కడ?
, మంగళవారం, 13 జులై 2021 (20:21 IST)
Deniz Saypinar
ప్రముఖ టర్కీ ఫిట్‌నెస్ మోడల్ దెనిజ్ సెపినర్(26)కు తన వస్త్రధారణతో విమానంలో చేదు అనుభవం ఎదురయ్యింది. తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే ఆమె వెస్ట్రన్ దేశాలను వలస వెళ్లింది. అక్కడ తనకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఊహించని రీతిలో అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.
 
టర్కీ నుంచి అమెరికా వెళ్లిన దెనిజ్ సెపినర్ ఫిట్‌నెస్‌ మోడల్‌గా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్‌‌గా గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్‌ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు విమానంలో బయలు దేరింది. అయితే ఫ్లైట్‌ ఎక్కిన కొద్దిసేపటికి విమాన సిబ్బంది ఒకరు వచ్చి.. 'మీరు దిగిపోవాలి' అని కోరాడు. అతడి మాటలు విని ఆమె అది జోక్‌గా అనుకుందిట. దీంతో 'మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్‌ ఇబ్బంది పడతాయి. దిగిపోండి' అని మరోసారి చెప్పాడట.
 
కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా 'మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేనంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని ఆమె వాపోయింది.
 
'ఆ మాట వినగానే నాకు భయం వేసింది. వణికిపోయా వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా… రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా… కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు' అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్‌ చేసింది దెనిజ్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14 వేల ట్రై సైకిళ్లు ఏర్పాటుకు సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్