దక్షిణ చైనా సముద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. శ్రీలంక నుంచి వలస వెళ్తు సముద్రంలో చిక్కుకున్నారు 396 మంది ప్రయాణికులు. చాలామంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 30 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీలంకలో ఆర్థిక పరిస్థితులు మరింత అద్వాన్నంగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు, బతుకు కోసం వలస బాట పట్టారు లంకలోని తమిళులు.
లంక దాటి ఏ తీరానికి చేరినా ఫర్వాలేదని బాధితులంతా కలిసి బయలుదేరారు. బోటు సామర్థ్యానికి మించి ఎక్కడం, వాతావరణం అనుకూలించకపోవడంతో బోటు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కట్ అయ్యింది. ఏడుగు గంటల క్రితం సిగ్నల్స్ కట్ అవగా.. ట్రాకింగ్ మిస్ అవ్వడానికి ముందు బాధితులు ఆర్తనాదాలు పెట్టారు.
తమను కాపాడాలంటూ తమిళనాడులోని బంధువులకు ఫోన్ చేసి ప్రాధేయపడుతున్నారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న బోటు ఉన్నట్టా, లేక సముద్రంలో మునిగిపోయిందా? అనేది తెలియరాలేదు.