Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హమ్మయ్య-ఇస్తాంబుల్‌లో రష్యా-ఉక్రెయిన్ చర్చలు ఫలప్రదం..

హమ్మయ్య-ఇస్తాంబుల్‌లో రష్యా-ఉక్రెయిన్ చర్చలు ఫలప్రదం..
, మంగళవారం, 29 మార్చి 2022 (23:18 IST)
Russia_ukraine
రష్యా-ఉక్రెయిన్​ మధ్య టర్కీలోని ఇస్తాంబుల్​లో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్​లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది.
 
ఇస్తాంబుల్ చర్చల తర్వాత.. పుతిన్, జెలెన్​స్కీ సమావేశం అయ్యే అవకాశం ఉందని ఉక్రెయిన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు, ఉక్రెయిన్ భద్రత వంటి అంశాలే లక్ష్యంగా ఇస్తాంబుల్​లో చర్చలు జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వివరించారు.
 
ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలు ఫలప్రదంగా సాగడం వల్ల చమురు సరఫరాపై ఉన్న భయాలు వీడాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర 5శాతానికిపైగా తగ్గింది. మరోవైపు రష్యా కరెన్సీ రూబెల్ విలువ 10శాతం మేర పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘మేం తటస్థంగానే ఉంటాం’- రష్యా హామీలకు స్పందనగా యుక్రెయిన్ హామీ