ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో తొలిదర పోరు ముగిసిందని తెలిపింది. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామని, ఇకపై తమ దళాలు డాన్ బాస్ ప్రాంతానికి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించడంపై దృష్టిసారిస్తాయని రష్యా తన ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా గత నెల 24వ తేదీన భీకర యుద్ధం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నప్పటికి రష్యా బలగాలకు పట్టుచిక్కడంలేదు. రష్యా దాడులకు ఉక్రెయిన్ సేనలు తీవ్ర ప్రతిఘటన ఇస్తున్నాయి. ఈ కారణంగానే నెల రోజులకు పైగా ఈ దాడులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై తాము చేపడుతున్న సైనిక చర్యలో తొలి దశ విజయవంతం అయిందని వెల్లడించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకున్నామని పేర్కొంది. ఇకపై తమ దళాలు డాన్ బాస్ ప్రాంతానికి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించడంపై దృష్టిసారిస్తాయని రష్యా తన ప్రకటనలో పేర్కొంది.