Publish Date: Thu, 22 Nov 2018 (12:48 IST)
Updated Date: Thu, 22 Nov 2018 (13:48 IST)
చాలామందికి దంతాలు పసుపు పచ్చగా ఉంటాయి. ఆ రంగు తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. మరి బయట షాపుల్లో దొరికే వాటిని వాడుదాం అనుకుంటే.. సమస్య మరింత పెరిగిపోతుంది. కనుక ఇంట్లోని పదార్థాలు ఉపయోగించండి. దంతాల రంగు మారుతుంది. అంతేకాదు.. చిగుళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. ఆ పదార్థాలేంటో చూద్దాం...
1. తులసి ఆకుల్నిఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడితో ప్రతిరోజూ బ్రష్ చేసుకుంటే పళ్లపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి. అంతేకాకుండా పళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి.
2. లవంగాలను వేయించి పొడి చేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి పళ్లు రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన పళ్లు తళతళా మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి.
3. బొప్పాయి తొక్కలతో పళ్లు రుద్దుకుంటే దంతాలపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి. అంతేకాకుండా చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
4. స్ట్రాబెర్రీలను పేస్ట్‌లా చేసి అందులో చిటికెడు వంటసోడా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో పళ్లను రుద్దుకోవాలి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్-సి, యాసిడ్‌లు పళ్లకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి.
5. ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో పళ్లు రుద్దుకొని కాసేపటి తరువాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పళ్లకుండే పసుపు రంగు పోతుంది.
webdunia
Publish Date: Thu, 22 Nov 2018 (12:48 IST)
Updated Date: Thu, 22 Nov 2018 (13:48 IST)