అల్లంను అతిగా తీసుకోవడం ద్వారా గుండెలో మంట, అతిసారం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. గర్భిణీ స్త్రీలు మోతాదుకు మించి అల్లం తీసుకోకూడదు. అలా తీసుకుంటే రక్తస్రావం.. గర్భస్థ శిశువు లైంగిక హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రోజుకు గ్రాము మాత్రమే అల్లం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పరగడుపున అల్లం తీసుకోవడం మంచిది కాదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి మితంగా తీసుకోవడం ద్వారా ఇలాంటి రుగ్మతల నుంచి దూరం చేసుకోవచ్చు. పసుపు అల్లం టీని తీసుకోవచ్చు కానీ.. అవి కిడ్నీలో రాళ్లు, పిత్తాశయ సమస్యలు వున్నవారు తీసుకోకూడదు.
అలాగే నిద్రించే ముందు అల్లం టీ తీసుకోకూడదు. అలా తీసుకుంటే నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజూ ఆహారంలో మితంగా వాడితే కడుపు ఉబ్బరం తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చునని వారు చెప్తున్నారు.