వేసవి సీజన్లో వచ్చే పండ్లను తప్పకుండా తినాలి. మామిడి, పుచ్చకాయ, పనసకాయలతో పాటు సపోటా పండ్లను కూడా తీసుకుంటూ వుండాలి. సపోటా పండ్లును తరచూ తింటూ ఉంటే దృష్టిలోపాలు దూరమవుతాయి. అంతేకాకుండా రోగనిరోదక శక్తి పెరగడంతో పాటు ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది.
ఇవి మలబద్దక సమస్యను తగ్గిస్తాయి. ఈ పండులోని కొన్ని రసాయనాలు పేగు చివరన ఉండే పలుచని శ్లేష్మపొర వ్యాధిగ్రస్తం కాకుండా కాపాడుతాయి.
రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్ధులు తరచూ సపోటా పండ్లను తింటే శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుండి బయటపడతారు. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.
సపోటాలో రక్తవృద్ధి, ధాతుపుష్టిని కలిగించే అంశాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలున్నాయి. సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు లభిస్తాయి.
సపోటాలో కాల్షియం, పొటాషియం, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, సమృద్ధిగా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరస్ గుణాలు కూడా ఇందులో ఎక్కువే. విటమిన్-ఏ, సీ విటమిన్లు కూడా ఇందులో ఉన్నాయి.