Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొగతాగే అలవాటు లేకున్నప్పటికీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఎందుకు?

Advertiesment
National Institutes of Health
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (20:19 IST)
యుఎస్‌లోని ఆరోగ్య మరియు మానవ సేవల విభాగంలో భాగమైన నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌), అస్సలు పొగతాగే అలవాటు లేనప్పటికీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడడం వెనుక రహస్యాన్ని ఛేదించింది. ఇది మరింత ఖచ్చితమైన చికిత్సావకాశాలను అభివృద్ధి చేయడంలో తోడ్పడవచ్చు. అసలు పొగతాగని చరిత్ర కలిగి ఉండి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడిన వ్యక్తుల జన్యు విశ్లేషణ చేసిన తరువాత అధిక శాతం కణితిలు శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియల కారణంగా జరిగే మ్యూటేషన్స్‌ వల్ల ఏర్పడుతున్నాయని గుర్తించారు.
 
ఈ అధ్యయనాన్ని నేషనల్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌సీఐ) పరిశోధకులతో కూడిన అంతర్జాతీయ బృందం నిర్వహించడంతో పాటుగా మొట్టమొదటిసారిగా పొగతాగని వ్యక్తులలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి మూడు మాలిక్యులర్‌ ఉప విభాగాలను సైతం వివరించింది. ఈ అంశాలను ఇటీవల నేచర్‌ జెనిటిక్స్‌‌లో ప్రచురించారు.
 
‘‘అసలు పొగతాగని వ్యక్తులలో వైవిధ్యమైన ఉప విభాగాలు ఉన్నట్లుగా గుర్తించాము. అవి వైవిధ్యమైన మాలిక్యుర్‌ లక్షణాలతో పాటుగా పరిణామ ప్రక్రియలనూ కలిగి ఉన్నాయి’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన  ఎపిడెమియాలజిస్ట్‌ మారియా థెరెసా లండీ అన్నారు. ఈ ఉప విభాగాల ఆధారంగా భవిష్యత్‌లో చికిత్సలను సైతం నిర్వహించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
 
ప్రతి సంవత్సరం దాదాపు రెండు మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లుగా గుర్తిస్తున్నారు. గాలి కాలుష్యంతో పాటుగా గతంలో ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చి ఉండటంతో పాటుగా అసలు పొగతాగని వ్యక్తులకు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రావడం కనిపిస్తుంది. అయితే శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఈ క్యాన్సర్‌లలో అధిక శాతం ఎలా వస్తున్నాయో తెలీదు. ఈ భారీ అధ్యయనం ద్వారా అధ్యయనకారులు కణితి కణజాలంలో జన్యుమార్పులను గమనించడంతో పాటుగా అసలు పొగతాగని, క్యాన్సర్‌బారిన పడిన 232 మంది వ్యక్తుల సాధారణ కణజాలంతో పోల్చారు.
 
ఈ జినోమిక్‌ విశ్లేషణలో మూడు వినూత్నమైన ఉపవిభాగాలను ఎన్నడూ పొగతాగని వ్యక్తులకు సంభవించిన ఊపిరితిత్తుల క్యాన్సర్‌లలో గుర్తించారు. వారిలో క్యాన్సర్‌ ఉన్న స్థితిని అనుసరించి నాయిస్‌, పియానో, మెజ్జో-ఫోర్ట్‌గా వీటిని విభజించారు.
 
‘‘ఈ ఉపవిభాగాలను వేరు చేయడాన్ని ప్రారంభించాం. నివారణ మరియు చికిత్స కోసం విభిన్నమైన విధానాలను  అనుసరించేందుకు ఇది తోడ్పడవచ్చు’’ అని డాక్టర్‌ లాండీ అన్నారు. ఎన్‌సీఐ- డివిజన్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ ఎపిడెమియాలజీ అండ్‌ జెనిటిక్స్‌ డైరెక్టర్‌  స్టీఫెన్‌ జె చానోక్‌ మాట్లాడుతూ, ‘‘విభిన్నమైన క్యాన్సర్‌ రకాలను కనుగొనేందుకు నూతన మార్గాలను ఇది తెరువనుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెంగూజ్వరం... తీసుకోవలిసిన జాగ్రత్తలు