Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపాల్ ఆసుపత్రిలో 87 సంవత్సరాల వ్యక్తికి అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స

Advertiesment
మణిపాల్ ఆసుపత్రిలో 87 సంవత్సరాల వ్యక్తికి అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స
, సోమవారం, 8 మార్చి 2021 (21:42 IST)
విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్‌లో విజయవంతంగా అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్సగా చెప్పబడుతున్న ట్రాన్స్‌కాథెటర్‌ అరోటిక్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ (టీఏవీఆర్‌)ను 87 సంవత్సరాల వయసు కలిగిన రోగి యొక్క అరోటిక్‌ వాల్వ్‌కు చేశారు. ఈ రోగిని హార్ట్‌ ఫెయిల్యూర్‌, కార్డియోజెనిక్‌ షాక్‌ మరియు కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం వంటి సమస్యలతో అత్యవసర విభాగానికి శస్త్రచికిత్సకు తీసుకువచ్చారు. ఈ రోగిని తక్షణమే అక్కడ వెంటిలేటర్‌పై అమర్చారు.
 
విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్‌లో క్రిటికల్‌ కేర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌టీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘‘ఈ రోగి మమ్మల్ని సంప్రదించినప్పుడు అతని గుండె విఫలం కావడంతో పాటుగా అరోటిక్‌ వాల్వ్‌లో తీవ్రమైన లీకింగ్‌ (రక్తం వెనక్కి తీసుకోవడం) కనబడింది. మేము తక్షణమే ఆయనను వెంటిలేటర్‌ మీద ఉంచాము. ఆయన హెమోడైనమిక్‌గా కూడా అస్థిరంగా ఉన్నారు. ఆ కారణం చేత ఇనోట్రోప్స్‌ను ఆయనకు అందించడం ద్వారా గుండె పనిచేసేలా చేయగలిగాము. ప్రణాళిక చేసిన రీతిలో టీఏవీఆర్‌ ప్రక్రియ చేయడం ద్వారా మేము ఆయనను కాపాడాము. ఈ చికిత్స తరువాత రోగి స్థితి మెరుగుపడింది మరియు అతనికి వెంటిలేటర్‌ తొలిగించాము’’ అని అన్నారు.
 
ఈ సమావేశంలో డాక్టర్‌ ఎన్‌ మురళీకృష్ణ, ఇంటర్వెన్షనల్‌ సీనియర్‌ కార్డియాలజిస్ట్- మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ వారు మాట్లాడుతూ, ‘‘ఈ రోగికి 2008లో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయింది. ఆ సమయంలో ఆయనకు బయో-ప్రోస్థటిక్‌ వాల్వ్‌ను అమర్చారు. ఈ రోగి షాక్‌ స్థితిలో ఉండటం వల్ల ఎలాంటి శస్త్ర చికిత్సకు అయినా సిద్ధంగా లేరు. ఈ రోగిని కాపాడటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం టీఏవీఆర్‌ శస్త్రచికిత్స చేయడం. దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న బయో ప్రోస్థటిక్‌ వాల్వ్‌లో మరో వాల్వ్‌ను జొప్పించడం చేశాం. ఇది అత్యంత అరుదైన శస్త్రచికిత్స. మేము విజయవంతంగా దీనిని నిర్వహించడం వల్ల రోగి కోలుకోగలిగారు’’ అని అన్నారు.
 
డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి, హాస్పిటల్‌ డైరెక్టర్‌- మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ వారు మాట్లాడుతూ, ‘‘అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్ని రకాల చికిత్సలనూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పొందగలరనే భరోసా కల్పించేందుకు మణిపాల్‌ హాస్పిటల్‌ తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ కేసు దానికి ఓ నిదర్శనం. క్రిటికల్‌ కేర్‌, కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లు చూపిన చొరవను నేను అభినందిస్తున్నాను. దాదాపుగా మృత్యువుకు దగ్గరైన రోగిని వారు తిరిగి ఆరోగ్యంగా కోలుకునేలా చేయగలిగారు. 87 సంవత్సరాల వయసు కలిగిన రోగికి విజయవంతంగా శస్త్రచికిత్సను చేసి జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్లు, సిబ్బందిని నేను అభినందిస్తున్నాను’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలకు డ్రైవింగ్ నేర్పి, వారిని సాధికారులుగా తీర్చిదిద్దుతున్న ధైర్య