Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలకు డ్రైవింగ్ నేర్పి, వారిని సాధికారులుగా తీర్చిదిద్దుతున్న ధైర్య

Advertiesment
Dhairya
, సోమవారం, 8 మార్చి 2021 (17:37 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలు జరుపుకునే రోజు. ఈ రోజును లింగ సమానిత్వం కోసం పాటుబడి, మన గమ్యాన్ని చేరుకోవడానికి కుడా గమనిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల విజయాలను అభినందిస్తూ, లింగ సమానత్వానికి పాటుపడుతూ ఎన్నో సంఘాలు సంబరాలు జరుపుతారు. ఇలా మహిళల సాధికారత కోసం పని చేస్తున్న సంస్థ ధైర్య ఫౌండేషన్.
 
ధైర్య అనేది ఒక నాన్‌ప్రాఫిట్ సామాజిక సంస్థ. వారు పేద కుటుంబాలకు చెందిన మహిళలకు కమర్షియల్ డ్రైవర్ లైసెన్సును అందిస్తారు. ఈ ఫౌండేషన్ పట్టణాలలో ఉన్న పేద మహిళలకు ఉపాదినంచడానికి, వారిని గుర్తించి, వారికి డ్రైవర్ శిక్షణ అందిస్తారు. ఈ ప్రాజెక్టు మహిళలకు ఉద్యోగ నిర్దిష్ట నైపుణ్యాలు, నిర్వాహక మరియు వ్యవస్థాపక సామర్థ్యాలను అందించి, దీని ద్వారా వారికి మరిన్న ఆదాయ అవకాశాలను కల్పించాని వీరి ఆశయం.
 
ఈ స్వఛ్ఛంద సంస్థను ప్రసన్న దొమ్ము మరియు టిండు నిఖత్ స్థాపించారు. ఈ సంస్థ తెలంగాణా ప్రభుత్వం మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి పెట్టిన వి హబ్ వారితో ఇంకుబేట్ అయ్యి ఉంది. పైలట్ ప్రాజెక్టుగా, ధైర్య నలుగురు ఇళ్ళల్లో పని చేసే మహిళలకు ఆటోలు నడపడానికి శిక్షణ ఇచ్చారు. ఆ మహిళలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి, ఫిబ్రవరి 2020లో లైసెన్స్ పొందిన ఆటో రిక్షా డ్రైవర్లుగా మారారు. 2020 మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళల కొత్త వృత్తిని ప్రారంభించడానికి ఫౌండేషన్ ర్యాలీని నిర్వహించింది. ఈ మహిళా డ్రైవర్లలో భాగమైన అనిత మరియు కవితలకు ఆటోలు కొనడానికి, ఫౌండేషన్ మిలాప్‌లో 2 వేర్వేరు క్రౌడ్ ఫండింగ్ కాంపైన్లు ప్రారంభించారు.
webdunia
ధైర్య వ్యవస్థాపకులలో ఒకరైన ప్రసన్న దొమ్ము మాట్లాడుతూ, “లాక్డౌన్ తరువాత, ఫౌండేషన్ మహిళలను డెలివరీ భాగస్వాములుగా శిక్షణ ఇవ్వడంలో ఒక ప్రైవేట్ సంస్థతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు మేము విజయవంతంగా శిక్షణ ఇచ్చి 8 మంది మహిళా డ్రైవర్లకు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాము. 2021లో హైదరాబాద్‌లో 100 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగంలో చేర్పిస్తామని వారితో ఒక ఎంఓయు కూడా ఉంది. ప్రస్తుతం, మహిళలతో డెలివరీ భాగస్వాములుగా పనిచేయడానికి శిక్షణ ఇవ్వడం ద్వారా మేము ఈ ఎంఓయుని నెరవేర్చడంలో నిమగ్నమై ఉన్నాము.”
 
ప్రసన్న మరింత వివరిస్తూ, “ ధైర్యతో పట్టణ మహిళలో నైపుణ్యం లేని వల్ల వారు కోల్పోయే అవకాశాలను ఉద్దేశిస్తూ, వారికి నిర్వాహక మరియు వ్యవస్థాపక సామర్థ్యాలను నేర్పించి, వారు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందేట్టు చేస్తాము. మరో మాటలో చెప్పాలంటే, మహిళలకు వారి పూర్తి సామర్థ్యాన్ని అందించి, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి ధైర్య - అనగా ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాము.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రీడా రంగంలో తడాఖా చూపెట్టిన మహిళా క్రీడాకారులు.. నాన్న రిక్షా డ్రైవర్, తల్లి నర్సు, చేతిలో విల్లు...?!