Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌లను తీసుకోవాలని ప్రజలను కోరుతున్న మణిపాల్‌ హాస్పిటల్‌

Advertiesment
MANIPAL HOSPITAL
, శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:53 IST)
మొదటి దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిన విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్స్‌ ఇప్పుడు రెండవ దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని హెల్త్‌కేర్‌ వర్కర్ల కోసం ప్రారంభించింది. మొదటి దశలో మొత్తంమీద 800 మంది డాక్టర్లు మరియు సిబ్బందికి వ్యాక్సిన్‌లను అందజేశారు. అంటే మొత్తం సిబ్బందిలో 98%కు వ్యాక్సిన్‌ను 8 రోజుల కాలంలో అందజేయడం ద్వారా విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో అత్యధిక సంఖ్యలో సిబ్బందికి వ్యాక్సిన్‌ను అందించిన హాస్పిటల్‌గా నిలిచింది.
 
రెండవ దశ ప్రారంభించిన సందర్భంగా డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి, హాస్పిటల్‌ డైరెక్టర్‌– మణిపాల్‌ హాస్పిటల్‌ వారు మాట్లాడుతూ  ముందుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చురుగ్గా చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటుగా డీఎంహెచ్‌ఓ, గుంటూరు వారికి ధన్యవాదములు తెలియజేశారు. ఈ వ్యాక్సిన్‌ పనితీరు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ప్రజలలో అనేక సందేహాలు, పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ వ్యాక్సినేషన్‌ను మూడు దశలలో పరీక్షలు చేశారు. తనతో పాటు మొత్తం మణిపాల్‌ సిబ్బంది వ్యాక్సిన్‌ను తీసుకున్నామని, అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉన్నారని, మెరుగ్గా వారు పనులు చేసుకుంటున్నారు కాబట్టి వ్యాక్సిన్స్‌ను తీసుకోవడానికి ప్రజలు ధైర్యంగా ముందుకు రావాల్సిందిగా కోరారు.
 
డాక్టర్‌ సీహెచ్‌ మనోజ్‌కుమార్‌– చీఫ్‌ ఆఫ్‌ క్లీనికల్‌ సర్వీసెస్‌ అండ్‌ కన్సల్టెంట్‌ జనరల్‌ మెడిసన్‌, మణిపాల్‌ హాస్పిటల్‌ మాట్లాడుతూ ‘‘జనవరి 2021లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆరంభించినప్పటికీ ఎన్నో అపోహలు, పుకార్లు దీని చుట్టూ అలుముకోవడంతో ప్రజలు దీనిని సందేహాస్పదంగా చూస్తున్నారు. కొంతమంది ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత ఆల్కహాల్‌ తీసుకుకూడదని, అలా తీసుకుంటే అది విషంగా మారుతుందని అపోహపడుతున్నారు (అసలు వ్యాక్సిన్‌ల ముఖ్యోద్దేశం రోగ నిరోధక శక్తి పెంపొందించడం. శరీరంలో యాంటీబాడీలను ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తుంది.
 
ఆల్కహాల్‌ వల్ల మొత్తం వ్యాక్సిన్స్‌ ప్రక్రియ ప్రభావితం అవుతుంది. అది అసలు కారణం. దీనివల్లనే ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకోవద్దని చెబుతుంటారు). ఇక గర్భిణిలు, పిల్లలకు పాలిస్తున్న తల్లులకు కూడా వ్యాక్సిన్‌ వేయడం లేదంటే ఈ వ్యాక్సిన్‌లలో ఏదో లోపం ఉంది అని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు (గర్భిణిలు, పాలిస్తున్న తల్లులను వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ సమయంలో పరిగణించ లేదు. అందువల్ల వారిని వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ నిబంధన వ్యాక్సిన్‌ నాణ్యతకు సంబంధం లేనిది).
 
కొంతమంది, కోవిడ్‌ అయితే ఈ వ్యాక్సిన్‌ వేయించుకోకూడదని చెప్పడం వల్ల అసలు ఈ వ్యాక్సిన్‌ వల్ల ఉపయోగం ఏముంది అని అడుగుతున్నారు ( కోవిడ్‌ నుంచి కోలుకుంటే వారిలో సహజంగానే రోగ నిరోధక శక్తి మూడు నెలల వరకూ ఉంటుంది. అందువల్ల, కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తి వ్యాక్సిన్‌ను 4-8 వారాల పాటు నిరోధించమని చెబుతున్నారు) ఈ తరహా అపోహలను అసలు నమ్మరాదు మరియు ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రావాలి. అంతేకాదు, వ్యాక్సినేషన్‌ మరియు స్వీయ భద్రత రెండూ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. వ్యాక్సిన్‌ వేయించుకున్న తరువాత కూడా మాస్కులు మరియు శానిటైజర్లను ప్రజలు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చక్కెర వ్యాధికి స్వీట్ రూల్స్, ఇలా చేస్తే డయాబెటిస్ అదుపులో...