Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యాప్‍ జెమినిలో భారీగా ఉద్యోగాలు.. 30వేల మంది ఐటీ ఉద్యోగులను..?

క్యాప్‍ జెమినిలో భారీగా ఉద్యోగాలు.. 30వేల మంది ఐటీ ఉద్యోగులను..?
, శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:28 IST)
CapGemini
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‍ జెమిని ఈ ఏడాది భారత్‍లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. 2021లో భారతదేశంలో సుమారు 30,000 మందిని ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్టు క్యాప్‍ జెమిని సీఈవో అశ్విన్‍ యార్డి తెలిపారు. 
 
ఫ్రెషర్స్తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఆర్టిఫిషియల్‍ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్‍, 5జీ, సైబర్‍ సెక్యూరిటీ, ఇంజనీరింగ్‍, అర్‍అండ్‍డి లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్‍ నైపుణ్యాలలో తాజా నియమాకలను చేపడతామన్నారు. ఇది గత సంవత్సరంలో పోలిస్తే 25 శాతం పెరిగిందని తెలిపారు. కోవిడ్‍-19 నేపథ్యంలో డిజిటల్‍ సొల్యూషన్‍కు పెరిగి భారీ డిమాండ్‍ తమవ్యాపార అవకాశాలను మెరుగుపర్చిందన్నారు. 
 
డిసెంబర్‍ త్రైమాసికంలో క్యాప్‍ జెమిని ఆదాయంలో 65 శాతం వాటా క్లౌడ్‍ బిజినెస్‍, డిజిటల్‍ సొల్యూషన్స్‌దే కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో వ్యాపారం తిరిగి పుంజుకుంటుందని, భారీ డీల్స్ సాధిస్తామనే అంచనాలతో భవిష్యత్తు మరిన్ని నియామకాలు చేపట్టాలని కూడా భావిస్తున్నట్టు చెప్పారు. 
 
అంతేకాదు, ఏప్రిల్‍ 2020లో, మహమ్మారి పీక్‍ సమయంలో కూడా తాము వేతన పెంపును ప్రకటించామని వెల్లడించారు. దేశీయంగా మొత్తం 1,25,000 మంది ఉద్యోగులతో ఉన్న గత ఏడాది భారతదేశంలో దాదాపు 24 వేల నియామకాలను చేపట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐజేకేతో పొత్తు.. ఏఐఎస్ఎంకే వ్యవస్థాపకుడు శరత్ కుమార్..