Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్షయ (టీబీ) భారతం : ఏడు దేశాల్లో అగ్రస్థానం.. డబ్ల్యూహెచ్ఓ నివేదిక

భారత్ టీబీ రోగుల కేంద్రంగా మారుతోందా? అవుననే అంటోంది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. ఈ సంస్థ 2016 సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో ఏడు దేశాలతో పోల్చితో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

క్షయ (టీబీ) భారతం : ఏడు దేశాల్లో అగ్రస్థానం.. డబ్ల్యూహెచ్ఓ నివేదిక
, బుధవారం, 1 నవంబరు 2017 (12:38 IST)
భారత్ టీబీ రోగుల కేంద్రంగా మారుతోందా? అవుననే అంటోంది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. ఈ సంస్థ 2016 సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో ఏడు దేశాలతో పోల్చితో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తర్వాత ఇండోనేషియ్, చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాలు ఉన్నాయి. అలాగే, గత యేడాదితో ప్రపంచ వ్యాప్తంగా 10.4 మిలియన్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 64 శాతం ఈ ఏడు దేశాల్లో నమోదు కాగా, వీటిలో ఎక్కువ కేసులు ఒక్క భారత్‌లోనే ఉన్నట్టు వెల్లడించింది. 
 
ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న టీబీ రోగుల మరణాల్లో కూడా భారత్ మొదటి స్థానంలో ఉంది. 2.8 మిలియన్ మరణాలు ప్రపంచంలో నమోదుకాగా, ఇందులో ఎక్కువ మరణాలు భారత్‌లో నమోదయ్యాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో క్షయ వ్యాధి ఓ కారణంగా ఉందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 
 
బ్యాక్టీరియా, మైక్రోబ్యాక్టీరియాల వల్ల వ్యాపించే ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. ఈ వ్యాధి కేసులు గత యేడాది ప్రపంచ వ్యాప్తంగా 10.4 మిలియన్ కేసులు నమోదు కాగా, ఇందులో 10 శాతం మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్న రోగులు కూడా ఉన్నారు. మొత్తం కేసుల్లో 64 శాతం కేసులను భారత్ సహా ఏడు దేశాల్లో నమోదుకావడం ఆందోళనకు గురిచేసే అంశంగా చెప్పుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంటికి మేలు చేసే ఖర్జూరాలు..