Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్జరీ లేకుండానే ఆర్ఎఫ్ విధానంతో బోన్ ట్యూమర్‌ల తొలగింపు

ఎలాంటి సర్జరీ లేకుండానే రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నిక్ విధానం బోన్ ట్యూమర్ల తొలగించే విధానాన్ని వెస్ట్‌మినిస్టర్ హెల్త్‌కేర్ కనుగొంది. ఈ విధానం ద్వారా గత దశాబ్దకాలంగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతూ వ

Advertiesment
సర్జరీ లేకుండానే ఆర్ఎఫ్ విధానంతో బోన్ ట్యూమర్‌ల తొలగింపు
, ఆదివారం, 19 ఆగస్టు 2018 (13:36 IST)
ఎలాంటి సర్జరీ లేకుండానే రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నిక్ విధానం బోన్ ట్యూమర్ల తొలగించే విధానాన్ని వెస్ట్‌మినిస్టర్ హెల్త్‌కేర్ కనుగొంది. ఈ విధానం ద్వారా గత దశాబ్దకాలంగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతూ వచ్చిన 22 యేళ్ళ యువతికి శాశ్వత ఉపశమనం కల్పించింది. ఈ యువతి మోకాలి ఎముకలో ఉన్న మల్టిపుల్ ట్యూమర్లను ఆర్‌ఎఫ్ టెక్నిక్ ద్వారా ఒకేసారి తొలగించడం వైద్యరంగంలోనే అత్యంత అరుదు అని వెస్ట్‌మినిస్టర్ హెల్త్‌కేర్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, ఎలాంటి సర్జరీ లేకుండానే అత్యంత క్లిష్టతరమైన ఈ ట్యూమర్లను ఇంటర్వెన్షనల్ రేడియాలజికల్ విధానం ద్వారా తొలిసారి తొలగించినట్టు వారు చెప్పారు.
 
ఇదే విషయంపై వెస్ట్‌మినిస్టర్ హెల్త్‌కేర్ రేడియాలజీ విభాగం అధిపతి డాక్టర్ నవీన్ జ్ఞానశేఖరన్ మాట్లాడుతూ, ఎముకలో అత్యంత అరుదుగా మల్టీఫోకల్ ఓస్టాయిడ్ ఓస్టెమా అనేది ఉంటుందన్నారు. దీన్ని తొలగించడం చాలా కష్టమన్నారు. అయితే, 22 యేళ్ల ఐశ్వర్యా మోహన్ అనే యువతికి ఈ ట్యూమర్ల కారణంగా పదేళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతూ వచ్చిందన్నారు. 
 
ఈ క్రమంలో ఆ యువతి అనేక ఆస్పత్రుల్లో చికిత్స కూడా తీసుకుందన్నారు. చివరగా తమవద్దకు రాగా, తాము వివిధ రకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత మోకాలిలో అనేక ట్యూమర్లు ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. ఈ ట్యూమర్లను ఎలాంటి ఆపరేషన్ లేకుండానే చిన్నపాటి సూది ద్వారా తొలగించేందుకు ప్రయత్నించామన్నారు. 
 
తమ ప్రయత్నం నూటికి నూరుశాతం విజయవంతమైందన్నారు. ఇందుకోసం తొలి ఆర్ఎఫ్ విధానాన్ని ఉపయోగించి ట్యూమర్లను పూర్తిగా తొలగించినట్టు తెలిపారు. ఈ విధానంలో మోకాలికి ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే చిన్నపాటి సూది ద్వారా ట్యూమర్లను తొలగించినట్టు వెల్లడించారు. అలాగే, రోగి ఐశ్వర్యా మోహన్ కూడా తాను పడిన బాధను వివరించింది. ప్రస్తుతం ఎలాంటి నొప్పి లేకుండా ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్డుసొనలో మజ్జిగను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?