Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నైట్ డ్యూటీలతో ప్రాణాలకు ముప్పు...

రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పు పొంచివుంది. నైట్ షిప్టుల్లో విధులు నిర్వహించే వారిలో ఎక్కువ మంది గుండెపోటులకు గురై ప్రాణాలు కోల్పోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇలా జరగడానిక

నైట్ డ్యూటీలతో ప్రాణాలకు ముప్పు...
, గురువారం, 12 జులై 2018 (11:43 IST)
రాత్రిపూట విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్యానికి ముప్పు పొంచివుంది. నైట్ షిప్టుల్లో విధులు నిర్వహించే వారిలో ఎక్కువ మంది గుండెపోటులకు గురై ప్రాణాలు కోల్పోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇలా జరగడానికిగల కారణాలను కూడా ఈ పరిశోధన విశ్లేషించింది.
 
* నైట్ షిఫ్టుల్లో విధులు నిర్వహించడం వల్ల ఊబకాయం, గుండెపోటు, గుండె జబ్బులు వస్తాయట. 
* శరీర కణజాలం నిద్రాణమైన సమయంలో పనిచేయడంతో శరీర జీవక్రియల్లో రసాయన ప్రక్రియలు అస్తవ్యస్తమై జీవగడియారాల్లో పెను మార్పులకు దారితీస్తుందట. 
* నైట్‌ షిఫ్ట్‌ల్లో పనిచేయడం ద్వారా మెదడులోని ప్రధాన గడియారం కాకుండా శరీరంలో ఉండే జీవ గడియారాలన్నీ ప్రభావితమవుతాయట. 
* రాత్రి వేళల్లో పనిచేయడానికి, తీవ్ర కిడ్నీ వ్యాధులకూ గురయ్యే ప్రమాదం ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. 
* శరీరంలోని కాలేయం, ప్రాంకియాస్‌, జీర్ణవ్యవస్థల్లో ఉండే గడియారాలు సైతం షిఫ్ట్‌ వేళలకు అనుగుణంగా మారిన నిద్ర, ఆహారపు అలవాట్లకు స్పందిస్తాయట.
* దీనివల్ల శరీరంలోని ఇతర గడియారాలు, మెదడులో ఉండే మాస్టర్‌ క్లాక్‌కు మధ్య సమతూకం దెబ్బతింటుందని అధ్యయనం తెలిపింది.
* ఈ అధ్యయనం రాత్రి, పగటి వేళల్లో పనిచేసే ఉద్యోగులపై చేపట్టారు. ఇందుకోసం రక్త నమూనాలను సేకరించి పరీక్షించారు. 
* నైట్‌ షిఫ్ట్‌ల్లో నెలల తరబడి కొనసాగినట్టయితే కేన్సర్‌, ఒబెసిటీ, కిడ్నీ సహా పలు వ్యాధులు చుట్టుముట్టే ముప్పు ఉందని వైద్యుల హెచ్చరిక. 
* పైగా, రాత్రివేళల్లో పనిచేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. 
* ఇలాంటివారి సాయంత్రం వేళ్లల్లో ఆహారం తీసుకోవద్దని, పగటి కంటే సాయంత్ర సమయాల్లో నిద్రించడం మేలని సూచించారు.
* ఈ పరిశోధనను వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సర్రేలు సంయుక్తంగా నిర్వహించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకుంటేనే మీ 'గుండె' పదిలం... లేదంటే?