Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాంసాహారులకు చికెన్‌ ఛాంపియన్స్ ఫుడ్, ఆరోగ్యం కూడా....

Advertiesment
మాంసాహారులకు చికెన్‌ ఛాంపియన్స్ ఫుడ్, ఆరోగ్యం కూడా....
, ఆదివారం, 1 మే 2022 (14:57 IST)
చికెన్ వంటకాలను రుచి చూసినప్పుడు మాంసాహారులకు నోరు ఊరుతుంది. అసలు చికెన్ తినడం నిజంగా విలువైనదేనా? దీనివల్ల నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? అవి మన శరీరాన్ని నిజమైన మరియు సానుకూల కోణంలో ప్రభావితం చేస్తాయా? వివరాలు చూద్దాం.

 
చికెన్ తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది మానవ శరీరంలో కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే చికెన్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎంత ఎక్కువ ప్రొటీన్లు తీసుకుంటే, కొవ్వు తగ్గుతుంది. ఫిట్‌నెస్ లేదా జిమ్‌కు వెళ్లే వారైతే భోజనంలో ఖచ్చితంగా చికెన్ వంటకాలు ఉండాలి.

 
ఇంకా చికెన్ స్ట్రెస్ బస్టర్‌గా కూడా పనిచేస్తుంది. చికెన్‌లో ట్రిప్టోఫాన్, విటమిన్ బి5 అనే రెండు రకాల ప్రొటీన్లు ఉంటాయి. ఇవి మీ హార్మోన్లలో ఒత్తిడిని తగ్గించే పాత్రను పోషిస్తాయి. చికెన్‌లో కాల్షియం, ఫాస్పరస్ వంటి వివిధ ఖనిజాలు ఉన్నాయి. ఇవి మన ఎముకలు పటిష్టంగా వుంచేందుకు పనిచేస్తాయి. ఆర్థరైటిస్ వంటి వివిధ వ్యాధులను చికెన్ తినడం ద్వారా అడ్డుకోవచ్చు.

 
ఈ కోవిడ్ యుగంలో రోగనిరోధక శక్తికి ముఖ్యమైన పాత్ర ఉంది. కాబట్టి భవిష్యత్తులో రోగనిరోధక శక్తికి సంబంధించన సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన చికెన్ తినడం మంచిది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి చికెన్ సూప్ ఒక గొప్ప ఔషధం. మన రోగనిరోధక శక్తి జలుబు, ఇతర వైరల్‌ సమస్యల నుంచి కాపాడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోరూరించే కొబ్బరి బర్ఫీ... తింటే ఏం జరుగుతుంది?