Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గసగసాలతో ఆ రోగాలు మాయం (Video)

గసగసాలతో ఆ రోగాలు మాయం (Video)
, మంగళవారం, 2 జూన్ 2020 (22:47 IST)
ఔషధ గుణాలున్న గసగసాలు వంటిట్లోనే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి శరీరంగల వారికి ఎంతో ఉపకరిస్తుందంటున్నారు. అతిసారం, నీళ్ళ విరేచనాలకు, తలలోని చుండ్రు నివారణ, నిద్రలేమి సమమస్యలకు చక్కటి పరిష్కారం గసగసాలు.
 
గసగసాలు, పటిక బెల్లం కలిపి రోజూ తింటుంటే అధిక వేడి తగ్గి దేహానికి చలువ చేస్తుందట. గసగసాలు, శొంఠి, కరక్కాయలు సమభాగాలుగా తీసుకుని నూరి బెల్లం కలిపి దంచి నిల్వ చేసుకుని ప్రతిరోజూ రెండు చెంచాలు సేవిస్తుంటే బోదకాళ్ళు, బోదజ్వరాలు తగ్గుతాయట. 
 
గసగసాలు, బాదం పప్పులు, కొబ్బరి కోరు, కర్భూజా గింజలు, చారపప్పు, పిస్తా కలిపి దంచి పటిక బెల్లం పొడి కలిపి నాలుగవ వంతు ఆవు నెయ్యి కలిపి ఉండలుగా చేసుకుని ప్రతిరోజూ ఒక్కొక్క ఉండను రెండు పూటలు సేవిస్తుంటే మెదడుకు బలం, పిల్లల్లో చురుకుదనం పెంపొందిస్తుంది. 
 
గసగసాలను నీటిలో నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు పట్టించి ఓ గంట తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తుంటే తలలోని కురుపులు, చుండ్రు తగ్గిపోయి వెంట్రుకలు ఆరోగ్యంగా మెరుగవుతాయట.
 
గసగసాలు దోరగా వేయించి నూరిన చూర్ణాన్ని రెండు పూటలూ పూటకు రెండు గ్రాములు అన్నంలో కలిపి తింటే మూడురోజుల్లో జిగట విరేచనాలు తగ్గిపోతాయి. వేడి చేసిన గసగసాలను గుడ్డలో మూటగా చుట్టి మాటిమాటికి వాసన చూస్తుంటే నిద్ర వస్తుంది. వీర్య స్థంభనకు పెట్టింది పేరు గసగసాలు. 
 
10గ్రాముల గసగసాలను నూరి అరకప్పు పాలల్లో కలిపి పటిక బెట్టం కలిపి తాగితే వీర్యస్థంభన జరుగుతుందట. మెదడు రోగాలకు గసగసాలు 30గ్రాములు, 30గ్రాములు బాదం పప్పు, 30గ్రాముల ఎండు ఖర్జూరాలు, 30గ్రాముల ఏలకులు, 30గ్రాములు తగినంత పటిక బెల్లంతో కలిపి దంచి ఆవు నెయ్యి కలిపి ఉండలు చేసుకోని ప్రతిరోజూ 5గ్రాముల పొడిని వెన్నెతో కలిపి తింటుంటే రక్త, జిగట విరేచనాలు కడుపులో నొప్పి తగ్గిపోతుందట. వేడి వేడి అన్నంలో పెరుగు కలుపుకుని తింటే బాధ నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ ఆభరణాలు ధగధగలాడుతూనే ఉండాలంటే?