Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

Advertiesment
food

సిహెచ్

, సోమవారం, 30 జూన్ 2025 (18:54 IST)
భోజనం. ఇటీవలి కాలంలో వేళాపాళా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం చేస్తున్నారు. అదేమంటే పని ఒత్తిడి అంటారు. వాస్తవానికి పని అనేది భోజనానికి అడ్డు కాదు. అందుకే వేళ ప్రకారం భోజనం చేయాలి. మరీ ముఖ్యంగా రాత్రి భోజనాన్ని నిద్రకు 3 గంటల ముందే చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాము.
 
రాత్రి భోజనాన్ని నిద్రకు 3 గంటలు ముందే చేస్తే రాత్రి నిద్ర నాణ్యత చాలా మెరుగ్గా ఉంటుంది.
రాత్రి భోజనం త్వరగా ముగిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు బలమైన రోగనిరోధక వ్యవస్థ చేకూరుతుంది.
ఇలా తినడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దొరికి చాలా ఆరోగ్యకరమైన విసర్జన వ్యవస్థకు దారితీస్తుంది.
రాత్రి భోజనం పెందలాడే తినడం వల్ల ఉదయాన్నే తేలికగా, శక్తివంతంగా ఉన్నట్లు భావిస్తారు. మేల్కొనేటప్పుడు తక్కువ ఇబ్బంది ఉంటుంది.
డిన్నర్ విషయంలో సమయపాలన పాటించడం వల్ల ఉదయపు అల్పాహారం ఆకలి మరింత సమతుల్యంగా మారుతుంది.
త్వరగా తినడం అంటే రాత్రి పడుకునే 3 గంటల ముందు తినేస్తే, గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గుతుంది.
నిద్రకు 2-3 గంటల ముందు తినడం వల్ల ఆహారాన్ని గ్లూకోజ్‌గా మార్చడం ద్వారా మన శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. 
నిద్రకు-భోజనానికి గ్యాప్ లేకుండా చేసే పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 15 శాతం ఎక్కువగా ఉంటుంది.
నిద్రపోయే కొన్ని నిమిషాల ముందు తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అంటే ఛాతీ ప్రాంతం దగ్గర మంటను ప్రేరేపిస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరగడుపున తినకూడని 8 పండ్లు