Publish Date: Sat, 28 Jun 2025 (22:41 IST)
Updated Date: Sat, 28 Jun 2025 (22:43 IST)
ఉదయాన్నే చాలామంది ఖాళీ కడుపుతో పండ్లను తినేస్తుంటారు. ఐతే కొన్ని రకాల పండ్లను పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము.
బొప్పాయి పండు బ్రోమెలైన్ కలిగి ఉంటుంది, ఇది ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది.
జామకాయలో ఫైబర్ అధికం, ఖాళీ కడుపుతో ఈ పండును తింటే కడుపులో సమస్య తలెత్తుతుంది.
నారింజలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
ద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కనుక ఖాళీ కడుపుతో తింటే ఇది కూడా జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
సీతాఫలంలో చక్కెర అధికం, ఈ పండును ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.
యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
బెర్రీ పండ్లులోని అధిక ఫైబర్ కంటెంట్ ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకానికి దారితీస్తుంది, భోజనం తర్వాత బెర్రీలు తినడం ఉత్తమం.