Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏసీకి నేరుగా కూర్చుంటున్నారా?

Advertiesment
ఏసీకి నేరుగా కూర్చుంటున్నారా?
, గురువారం, 6 డిశెంబరు 2018 (15:01 IST)
రోజంతా ఏసీ రూముల్లో కూర్చుంటున్నారా..? అయితే ఈ కథనం చదవాల్సిందే. సూర్యుని వెలుతురు, కిరణాలు శరీరంపై పడకుండా.. ఏసీ గదుల్లో గంటల పాటు కూర్చునే వారిలో అనేక రుగ్మతలు తొంగిచూస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏసీ గదుల్లో గంటల పాటు కూర్చునే వారిలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. తద్వారా హృద్రోగాలు, ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం వుందట. 
 
విటమిన్ డి శరీరానికి తగినంత లభించకపోవడం ద్వారా ఎముకల బలహీనమవుతాయని.. మోకాలి నొప్పి, వెన్నునొప్పి వంటి రుగ్మతలు తప్పవట. కొందరికి ఆస్తమా, తలనొప్పి వంటివి తప్పవని.. మధుమేహం వున్నవారి ఏసీల్లో కూర్చోకపోవడం మంచిదని.. తరచూ ఏసీల్లో కూర్చునే వారి చర్మం పొడిబారే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
ఏసీల్లో గంటల పాటు కూర్చునే వారిలో హెయిర్ ఫాల్ సమస్య ఉత్పన్నమవుతుంది. ఏసీ గదుల్లో గంటల పాటు కూర్చునే వారి చర్మం ముడతలు పడే అవకాశం వుంది. ఏసీలను శుభ్రం చేయకుండా ఉపయోగిస్తే చర్మానికి బ్యాక్టీరియా సోకే ప్రమాదం వుంది. అదే కార్యాలయాల్లో ఏసీల్లో తరచూ కూర్చునే వారు.. జలుబు, దగ్గు వంటి రుగ్మతలుండేవారి పక్కన కూర్చోకపోవడం మంచిది. 
 
ఏసీ నేరుగా కూర్చుని పనిచేయడం కూడదు. అలా చేస్తే సైనస్ సమస్య తప్పదు. సోరియాసిస్, ఎక్సిమా వంటి చర్మ సమస్యలున్నవారు ఏసీల్లో అధిక సమయం కూర్చోవడం కూడదు. ఏసీల్లో కూర్చోవడం తప్పనిసరి అయితే.. ఉదయం, సాయంత్రం పూట విటమిన్ డి పడేలా గంట సేపు సూర్యుని వేడి తగిలేలా నిలబడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?