Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొంతులో పిల్లికూతలు... ఆస్తమా అడ్డుకోవడం ఎలా?

Advertiesment
గొంతులో పిల్లికూతలు... ఆస్తమా అడ్డుకోవడం ఎలా?
, మంగళవారం, 8 అక్టోబరు 2019 (22:05 IST)
ఇటీవలి కాలంలో ఆస్తమా వ్యాధి ఎక్కువమందిలో కనబడుతోంది. కొందరిలో జలుబుతో మొదలై పిల్లికూతలు వస్తుంటాయి. గొంతులో గురగురమంటూ శబ్దం వస్తుంది. ఈ ఆస్తమా వ్యాధి వచ్చిందంటే ఇక ప్రాణం పోయినట్లే అనుకుంటారు చాలామంది. దీన్ని అంటురోగంగా భావించి వ్యాధిగ్రస్తులను దూరంగా పెడుతుంటారు. అది కరెక్టు కాదు. 
 
ఇప్పుడు కొత్త కొత్త మందులు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ మందులు వాడితో కొంతవరకే ఈ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలుగుతోంది. ఏదైనా కారణం కావచ్చు. అలర్జి కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఏ కారణాలు లేకున్నా ఈ వ్యాధి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. వంశపార్యపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.
 
ఉబ్బసం అనేది పూర్తిగా తగ్గిపోయే వ్యాధి కాదు. కాకపోతో దానికి తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవడం మూలంగా వాటి మూలాన కలిగే లక్షణాల తీవ్రత, ఇబ్బందులను నివారించుకుంటూ ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చును. ఉబ్బసం వలన కలిగే లక్షణాలు ప్రతిసారీ ప్రతిఒక్కరిలో ఒకలాగా ఉండవు. కొన్ని తీవ్రతరంగా ఉంటాయి. తీవ్రంగా ఉన్న ఉబ్బసం వ్యాధిగ్రస్తుల్లో ఊపిరి తీసుకునే గాలి గొట్టాలు చాలా వరకు మూసుకోవడం వలన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలకు ప్రాణవాయువు అందడం కష్టమైపోతుంది.
 
ఉబ్బసం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఉబ్బసం ఉన్న వ్యక్తులలో గాలి గొట్టాల లోపలి భాగం వాచినట్టవుతుంది. ఈ వాపు మూలంగా గాలి గొట్టాలు సన్నబడుతాయి. ఏవైనా పడని రసాయనాలు, ఇతర పదార్థాల వాసనలు గాలి ద్వారా పీల్చినప్పుడు లేదా నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఈ సమస్య ఎక్కవయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
ఊపిరి పీల్చినప్పుడు పిల్లి కూతలు, దగ్గు, ఛాతిపట్టినట్టుగా అనిపించడం, శ్వాస పీల్చుకోవడంలో కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే.. రాత్రి సమయంలో, తెల్లవారు జామున ఇటువంటి లక్షణాలు కనబడుతాయి. ఇది అత్యవసర పరిస్థితి, త్వరితగతిన వైద్య సహాయం అందని పక్షంలో ఇది కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కాగలదు. ఉబ్బసం ఉన్న వ్యక్తులు ఏ కారణం చేత వారికి ఈ లక్షణాలు కలుగుతున్నాయో గుర్తించి అవి కలుగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వైద్యుని సలహా మేరకు మందులను కూడా వాడుకోవచ్చును.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ బెంబేలెత్తిస్తున్న డెంగ్యూ ఫీవర్... ఎలా వస్తుంది? నిరోధించడం ఎలా?