Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

40 యేళ్లు నిండాయా? ఐరన్ వున్న పదార్థాలు తినాల్సిందే..

Advertiesment
40 యేళ్లు నిండాయా? ఐరన్ వున్న పదార్థాలు తినాల్సిందే..
, శనివారం, 1 డిశెంబరు 2018 (12:37 IST)
ఇటీవలికాలంలో అనారోగ్యంబారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు వివిధ రకాల జబ్బుల బారినపడుతున్నారు. దీనికి కారణం వయసుతో పాటు.. తీసుకుంటున్న ఆహరంలో మార్పులు రావడమే. చాలా మంది వేళుకు ఏం తింటున్నామా అనే విషయాన్ని పట్టించుకోరు. అందుకే వివిధ రకాల జబ్బులబారిన పడుతుంటారు. అయితే, 40 యేళ్లుదాటిన వారు మాత్రం విధిగా తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యదాయక జీవనశైలిని అలవర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే డైట్‌ తీసుకుంటే గుండె జబ్బులు, అల్జీమర్స్‌, కొన్ని రకాల కేన్సర్లు రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు. డయాబెటిస్‌, గుండె జబ్బులు, ఆస్టియో ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులు వచ్చిపడే సమయమిది. అందువల్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, యాంటీ ఆక్సిడెంట్లు, నట్స్‌, ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 
 
యాంటీ ఆక్సిడెంట్లు : పండ్లు, కూరగాయలు, బీన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. 
నట్స్‌ : పీనట్స్‌, వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఇ, విటమిన్‌ బి లభిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి.
 
ఐరన్‌ : మాంసాహారంలో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. వారంలో రెండు రోజులు డైట్‌లో నాన్‌ వెజ్‌ ఉండేలా చూసుకోవాలి. శాకాహారులైతే ధాన్యాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువును నియంత్రణలో ఉంచే పచ్చి బఠానీ