Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐస్ క్రీమ్ కొంత తింటే ఓకే, కానీ ఎక్కువగా తింటే?

Advertiesment
ఐస్ క్రీమ్ కొంత తింటే ఓకే, కానీ ఎక్కువగా తింటే?
, శనివారం, 17 జూన్ 2023 (23:31 IST)
ఐస్ క్రీమ్ అంటే చాలామందికి చాలాచాలా ఇష్టం. ఐతే ఐస్ క్రీమ్ కొద్దిమోతాదులో తింటే ఇబ్బంది తలెత్తకపోవచ్చు, కానీ మితిమీరి తింటే అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం లేకపోలేదు. ఐస్ క్రీం అధిక మోతాదులో తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. పరిమితికి మించి తినే ఐస్‌క్రీమ్‌తో కేలరీలు పెరుగుతాయి, ఇది శరీర బరువును పెంచుతుంది. ఐస్‌క్రీం మోతాదుకి మించి తినడం వల్ల రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. ఐస్ క్రీం అతిగా తినడం వల్ల గుండె ఆరోగ్యం పాడయ్యే అవకాశం లేకపోలేదు.
 
అదేపనిగా ఐస్ క్రీం తింటే అది మెదడు నరాలను ప్రభావితం చేస్తుంది. ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటే జీర్ణక్రియ సమస్యను కూడా కలిగించవచ్చు. ఐస్ క్రీం జీర్ణం కావడానికి సమయం పడుతుంది, ఫలితంగా కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. ఐస్ క్రీం సహజంగా మరీచల్లని పదార్థం కనుక అది చిగుళ్ళను బలహీనపరుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ యోగా ఆసనాలతో అధిక బరువు ఇట్టే తగ్గవచ్చు, అవేంటో చూద్దాము