Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

శరీరంలో చెడ్డ కొవ్వును కరిగించే గుమ్మడి గింజలు, ఇంకా ఏమేమి చేస్తాయో తెలుసా?

Advertiesment
pumpkin seeds benefits for female
, శుక్రవారం, 16 జూన్ 2023 (23:24 IST)
గుమ్మడి గింజలు. ఈ గింజలు తినడం వలన కలిగే ఆరోగ్య ఫలితాలను తెలిస్తే వాటిని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటాము. గుమ్మడిలో న్యూట్రీషియన్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడి గింజలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
గుమ్మడిలో ఉండే ఎ, సి, ఇ, కె విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్, జింక్, మెగ్నీషియం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.
 
గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు చెపుతున్నారు. ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తం పలుచగా వుండేవారు గుమ్మడి గింజలకు దూరంగా వుండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారంలో ఒక్కసారైనా గోధుమ రవ్వ ఉప్మా తినాలి, ఎందుకంటే?