Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రలేచిన తరువాత ఇలా వెకిలి వేషాలు వేస్తే ఏమవుతుందో తెలుసా?

Advertiesment
నిద్రలేచిన తరువాత ఇలా వెకిలి వేషాలు వేస్తే ఏమవుతుందో తెలుసా?
, శనివారం, 10 నవంబరు 2018 (12:55 IST)
ఉదయం నిద్ర లేచే సమయంలో కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఎగిరి కిందకు దుముకుతున్నట్లు దిగుతుంటారు. ఇటువంటి పొరపాట్ల వల్ల నడుము పట్టేయేడం, ఇతరత్రా కండరాలు పట్టడయేడం జరిగే అవకాశాలున్నాయి. అందుకే నిద్ర లేచేటప్పుడు హఠాత్తుగా లేచి నిలబడవద్దు. కనుకు నిద్రలేచిన తరువాత ఈ పద్ధతులు పాటిస్తే ఎలాంటి సమస్యలు రావు. అవేంటో చూద్దాం..
 
మంచం మీద పడుకున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. రక్తప్రసరణ నెమ్మదిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తిన్నగా లేచి నిలబడితే ఏదో ఒక కండరం హఠాత్తుగా పట్టే ప్రమాదముంటుంది. కొన్ని సందర్భాల్లో మెడ పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మంచం మీద నుంచి వెల్లకిలా ఉన్న భంగిమలో లేవవద్దు. మంచం మీదే పడుకుని వీలుని బట్టి కుడి లేదా ఎడమవైపుకు దొర్లి అలా పక్కకు తిరిగి ఉన్న భంగిమలో లేచి మంచం దిగాలి.
 
మంచం మీదు పడుకుంటే శరీరంలో ఎలాంటి నొప్పులు రావని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది కరెక్టే. కానీ, మంచం మీద పడుకుంటే రక్తసరఫరా నెమ్మదిగా ఉంటుంది. అందువలన ఉదయాన్నే నిద్రలేవగానే అలానే హఠాత్తుగా లేవకుండా.. కాస్త పక్కకు తిరిగి లేవాలి. లేదంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. పక్కకు తిరిగినపుడు శరీరపు ఒత్తిడిని చేతులు కొంతవరకు భరిస్తాయి. అందుకే మంచం దిగే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకర్షణీయమైన బెల్లీ కోసం.. ముడిబియ్యం..