సాయం సంధ్య వేలలో నిద్రించకూడదా.. ఎందుకు..?

సోమవారం, 29 అక్టోబరు 2018 (12:50 IST)
ఇంట్లో అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలు వస్తుంటాయి. కొందరైతే చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి తగాదాలు పెట్టుకుంటుంటారు. ఎప్పుడు చూసినా జగడాలు జరిగే ఇంట్లో లక్ష్మీదేవి ఉండరని పండితులు చెబుతున్నారు. అలానే సోమరితం, ప్రయత్నం వంటి చర్యలు లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండరు. ముఖ్యంగా స్త్రీలను కష్టపెట్టే ఇంట్లో మాత్రం లక్ష్మీదేవి అసలు ఉండరని వారు చెప్తున్నారు.
 
పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, గోవులు వంటివి లక్ష్మీదేవి రూపాలు. శుచి శుభ్రత, వేదవిహిత ధర్మ పాలన జరిగే ఇళ్ళల్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. ధన, ధాన్యం చేకూర్చుచేది కూడా లక్ష్మీదేవి అమ్మవారే. అలాగే ధనం, ధాన్యం, పూజాద్రవాలు, పెద్దలకు కాళ్ళు తగిలితే లక్ష్మీకి కోపం వస్తుందని పురోహితులు చెబుతున్నారు. 
 
ప్రాత కాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇండ్లల్లో అమ్మవారు ఉండదు. పెద్దలను గౌరవించే ఇళ్ళల్లో, సహనం గల స్త్రీలు ఉండే ఇళ్ళల్లో లక్ష్మీదేవి ఉంటుంది. రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని పురోహితులు చెప్తున్నారు. 
 
అందువలన మీ గృహంలో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలంటే.. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించాలి. సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకుని రంగవల్లికలతో అలంకరించుకుని.. లక్ష్మీదేవికి పూజలు చేసేవారింటికి లక్ష్మీదేవి వస్తుందని విశ్వాసం. కాబట్టి లక్ష్మీదేవిని దీపావళి రోజున నిష్ఠతో స్తుతించి, ఆమె అనుగ్రహం పొందడి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గృహ ప్రవేశం చేస్తున్నాం.. కానీ, మూడు సింహ ద్వారాలు ఉన్నాయి.. ఎలా?