Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్థూలకాయానికి కారణాలివే..?

Advertiesment
obesity
, శనివారం, 23 ఫిబ్రవరి 2019 (11:16 IST)
శరీరంలోని శ్వాసక్రియ నుండి విసర్జక్రియ వరకు సాగే మొత్తం జీవక్రియల్లో లోపం ఏర్పడడం స్థూలకాయానికి మూలకారణం. సహజంగా అయితే మనం తీసుకునే ఆహారం సంపూర్తిగా జీర్ణమవుతుంది. అప్పుడే అది శక్తిగా మారుతుంది. అయితే జీవక్రియల్లో లోపాలు ఏర్పడినప్పుడు ఆహార పదార్థాలు సగంసగంగానే జీర్ణమవుతాయి. 
 
రోజులు గడిచే కొద్దీ స్థూలకాయంతో కొన్ని చిక్కు సమస్యలే వచ్చిపడతాయి. వాటిలో ప్రత్యేకించి మధుమేహం, ఆస్తమా, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ముఖ్యమైనవి. అనగానే అదేదే ఆకృతిలో వచ్చే తేడాయే అనుకోవడానికి లేదు. ఇది శరీరంలోని కీలక భాగాల పనితీరునే దెబ్బ తీస్తుంది. స్థూలకాయాన్ని తగ్గించే క్రమంలో కడుపులోకి ఇచ్చే కొన్ని మందులు ఉంటాయి. ఇవి కొవ్వును, విషపదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. 
 
స్థూలకాయాన్ని తగ్గించడంలో ఆయుర్వేదం అనుసరించే విధానం అత్యంత సురక్షితమైనది. స్థూలకాయాన్ని, అధిక బరువును సంపూర్తిగా, శాశ్వతంగా తొలగించి వేస్తుంది. స్థూలకాయపు మూల కారణాన్ని కనిపెట్టడం, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, వ్యర్థపదార్థాలను తొలగించడం అనే క్రమంలో బరువు తగ్గించడం అప్పటికే వచ్చిపడిన స్థూలకాయపు ద్రుష్పభావాలను తొలగించడం ప్రధానలక్ష్యంగా తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యరశ్మి పొందకుంటే...?