Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్యరశ్మి పొందకుంటే...?

సూర్యరశ్మి పొందకుంటే...?
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:42 IST)
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ సమయంలో ఎండలో ఉన్నా సూర్యరశ్మిని పొందవచ్చు. కాకపోతే నేరుగా శరీరానికి తాకేలా చూసుకోవాలి. సూర్యరశ్మి కేన్సర్ నివారిణి అని పరిశోధకులు అంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల్లో చాలామందికి సూర్యరశ్మి ద్వారా లభించే డి విటమిన్ లభించట్లేదు. 
 
ఉదయం పూట గంట.. సాయంత్రం పూట గంట సూర్యుని కిరణాలు నేరుగా శరీరంపై పడేలా చూసుకుంటే 90 శాతం వ్యాధులు నశిస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఇలా ఎండలో కూర్చునే ముందుగా చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవాలి. దీంతో సూర్యుని కిరణాలు మన శరీరంలోని ప్రతీ కణాన్ని చేరతాయి. దీనివల్ల కణాలు చైతన్యవంతం అవుతాయి. దాంతో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. సూర్యుని కిరణాలు ప్రతీ కణానికి చేరడం వల్ల కణాలు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి.
 
సూర్యుడి కిరణాల కారణంగా శరీరంలో హార్మోన్ల పరంగా కొన్ని మార్పులు జరుగుతాయి. సూర్యుని కిరణాల వల్ల సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుంది. 
 
తగినంత సూర్యరశ్మి పొందకుంటే మన శరీరంలో సెరటోనిన్ స్థాయులు తగ్గిపోతాయి. ఫలితంగా ఒత్తిడి తప్పదు. నీరసం, అలసట వేధిస్తాయి. విటమిన్ డి తగ్గితే శరీరంలో ఎముకలు బలహీన పడే ఆస్టియోపోరోసిస్ తదితర సమస్యలు ఎదురవుతాయి. దంతాల ఆరోగ్యానికీ విటమిన్ డీతో సంబంధాలున్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెయ్యికి బాదం పలుకులు కలిపి వేడిచేసి..?