Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2021లో టాలీవుడ్ టాప్ -10 మూవీస్.. అఖండతో మొదలై.. క్రాక్‌తో

Advertiesment
2021లో టాలీవుడ్ టాప్ -10 మూవీస్.. అఖండతో మొదలై.. క్రాక్‌తో
, బుధవారం, 29 డిశెంబరు 2021 (16:39 IST)
అఖండ: నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌నాల‌ను సృష్టించాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మూడో సినిమాగా అఖండ‌ విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో బాల‌కృష్ణ‌తో ద్విపాత్రాభిన‌యం చేయించారు బోయపాటి. అఖండ సినిమా 25 రోజుల్లోనే 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. విడుదలైన 25వ రోజు కూడా 30 లక్షల వరకు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది అఖండ. 
webdunia
pushpa movie still
 
పుష్ప: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పుష్ప డిసెంబర్ 17న రిలీజ్ అయ్యింది. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కింది. కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న పుష్ప రెండో భాగం కోసం సుకుమార్ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ను ఖ‌రారు చేశారు. దాన్ని పుష్ప ది రూల్‌గా నిర్ణ‌యించారు. 
 
ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌రుస‌గా రెండు సినిమాలు రావ‌డం ఇదే ప్ర‌థ‌మం. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ స్టార్ట్ చేస్తే వ‌చ్చే ఈ ఏడాది చివ‌ర్లో కానీ.. లేదా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి కానీ పుష్ప ది రూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.
 
ఉప్పెన: పంజా వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటిస్తూ టాలీవుడ్‌కు పరిచయమైన చిత్రమే 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన రూపొందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
webdunia
Uppena



ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్‌ను చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ హైప్ నడుమ ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. 
 
వకీల్ సాబ్: రెండు సంవత్సరాల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన వకీల్ సాబ్‌ మొత్తానికి భారీ ఒపెనింగ్స్ అందుకుంది. శృతి హాసన్, అంజలి, నివేదా థామస్ మరియు అనన్య నాగళ్ల నటించిన ఈ సినిమా హిందీ చిత్రం పింక్‌కి రీమేక్ వచ్చింది. వకీల్ సాబ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 137. 65 కోట్లు అందుకుంది. ఇక ఇప్పటివరకు 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ చిత్రంగా నిలిచింది. 

webdunia
Vakeel saab
 
లవ్ స్టోరీ: నాగ చైతన్య - సాయి పల్లవి కలయికలో వచ్చిన మొదటి సినిమా లవ్ స్టొరీ ఏడాది భారీగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఫిదా లాంటి బాక్సాఫీస్ అనంతరం దర్శకుడు శేఖర్ కమ్ముల ఎంతో టైం తీసుకుని చేసిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
webdunia
Love story still


అంతేకాకుండా సాయిపల్లవి నటనకు కూడా ప్రత్యేకంగా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందాయి. సెన్సిటివ్ అంశాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించిన విధానం చాలా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
 
జాతి రత్నాలు: మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాలో వచ్చిన జాతిరత్నాలు సినిమాకు అనుదీప్ కెవి దర్శకత్వం వహించాడు. 
webdunia
Jaatiratnalu ph



ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరియు ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక జాతిరత్నాలు బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ ఏడాదిలో పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలను అందించిన సినిమాల్లో టాప్ 5లో నిలిచింది.
 
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
webdunia
Most Eligible Bachelor



గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, అమిత్ తివారీ, పోసాని కృష్ణ మురళి, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ తదితరులు నటించారు.  
 
టక్ జగదీష్: నిన్ను కోరి' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నాని.. శివ నిర్వాణ కాంబోలో వచ్చిన చిత్రమే 'టక్ జగదీష్'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'టక్ జగదీష్' మూవీలో నాని ఎమ్మార్వో పాత్రను పోషించాడు. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లు. థమన్, గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మించారు. నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
 
రంగ్‌దే: నితిన్ లవర్ బాయ్ ఇమేజ్‌తో పాటు, మహానటి వంటి సినిమాతో విమర్శకులను మెప్పించిన కీర్తి సురేష్ ప్రధానమైన బలం. చెక్ సినిమాతో నిరాశ పరిచిన నితిన్ నెల తిరక్కుండానే మరో సినిమాతో వచ్చాడు. 
webdunia
Rang de still



రంగ్ దే అంటూ కలర్ ఫుల్ సినిమా చేసాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరీ తెరకెక్కించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో అ..ఆ, భీష్మ లాంటి విజయాల తర్వాత నితిన్ చేసిన సినిమా రంగ్ దే. ఈ సినిమా తొలి 4 రోజులు మంచి వసూళ్లు సాధించింది.
 
క్రాక్: క్రాక్ సినిమాతో మాస్ మహారాజా రవితేజ అదరగొట్టాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన క్రాక్ రూ. 67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. 

webdunia


రవితేజ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక స్థాయిలో వసూళ్లను సాధించి పెట్టింది. అయితే కరోనా వైరస్ కేసుల పెరుగుదల కారణంగా కలెక్షన్లు చాలానే తగ్గాయి. అయినప్పటికీ 50% ఆక్యుపెన్సీలో సినిమా ఈ స్థాయిలో వసూళ్లను అందుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘వావ్‌.. వాట్‌ ఎ స్కీం.. వాట్‌ ఎ షేమ్‌. రూ.50లకే చీప్‌ లిక్కర్‌!