ఈ కాలంలో మెుక్కజొన్న ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావలసిన ఉత్సాహాన్ని అందిస్తుంది. దీనిని అలానే ఉడికించి.. లేదా టిక్కీలా కూడా తయారుచేసుకోవచ్చు. ఇలాంటివి ఈవినింగ్ స్నాక్స్‌గా తీసుకుంటే బాగుంటుంది. మరి టిక్కీ ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
మెుక్కజొన్న గింజలు - 1 కప్పు
చీజ్ - అరకప్పు
ఉల్లికాడల తరుగు - 2 స్పూన్స్
కొత్తిమీర - 1 కట్ట
ఎండుమిర్చి - 2
ఉప్పు - తగినంత
మెుక్కజొన్న పిండి - 2 స్పూన్స్
కారం - కొద్దిగా
నూనె - సరిపడా.
తయారీ విధానం:
ముందుగా ఓ గిన్నెలో మెుక్కజొన్నలు, కొత్తిమీర, చీజ్, ఉల్లికాడలు, ఎండుమిర్చి పొడి, ఉప్పు, మెుక్కజొన్న పిండి, కారం కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత టిక్కీల్లా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ముందుగ తయారుచేసుకున్న టిక్కీలను వేయించుకోవాలి. అంతే మెుక్కజొన్న టిక్కీ రెడీ.