బంగాళాదుంపలోని పోషక విలువలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. మధుమేహ వ్యాధికి ఇది చాలా మంచిది. శరీర నొప్పులను తగ్గిస్తుంది. సాధారణంగా పిల్లలు బంగాళాదుంపతో చేసిన వంటకాలు అంతగా ఇష్టపడరు. కానీ చీజ్ అంటే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. మరి చీజ్‌తో పొటాటో రోల్స్ ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు - 5
చీజ్ - ఒకటిన్నర కప్పు
కొత్తిమీర - 1 కప్పు
ఉప్పు - తగినంతా
మెుక్కజొన్న పిండి - 2 కప్పులు
కాన్ చీప్స్ - 2 కప్పులు
నూనె - వేయించడానికి సరిపడా
కారం - 4 స్పూన్స్
గరంమసాలా - 2 స్పూన్స్.
తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలను ఉడికించి వాటి తొక్కలను తీసేయాలి. ఇప్పుడు వాటిని స్మాష్ చేసుకుని అందులో సరిపడా కారం, ఉప్పు, గరంమసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా చీజ్ వేసి ఉండలుగా తయారుచేసుకోవాలి. ఇప్పుడు కాన్ చీప్స్‌లో ఈ ఉండలు వేసి రోల్ చేయాలి. ఆ తరువాత మెుక్కజొన్న పిండిలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకుని అందులో ఆ ఉండలను దిప్ చేసి నూనెలో వేయించాలి. అంతే పొటాటో చీజ్ రోల్స్ రెడీ.