Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కనుబొమలకు ఆముదం రాసి...?

కనుబొమలకు ఆముదం రాసి...?
, బుధవారం, 30 జనవరి 2019 (13:13 IST)
కొందరు చూడడానికి చాలా అందంగా ఉంటారు. కానీ, వారి కనుబొమలు మాత్రం అస్సలు కనిపించవు. ఆ కనుబొమలను అందంగా మార్చాలంటే.. ఏం చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే ఇది మీ కోసం...
 
రోజూ పడుకునే ముందు కనుబొమలకు ఆముదం రాసి సున్నితంగా మర్దన చేయాలి. ఇలా రెండు నెలలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బ్యూటీషియన్‌ను సంప్రదించి మీ ముఖాకృతిని బట్టి కనుబొమలు ఏ షేప్‌లో ఉండాలో అలా చేయమనాలి. అప్పటి నుండి రెండు వారాలకు ఒకసారి ఐబ్రోస్ షేప్ చేసుకోవాలి. 
 
గ్లిజరిన్, ఆముదం సమపాళ్ళల్లో కలిపి ఈ మిశ్రమాన్ని కనురెప్పలకు పట్టించాలి. అయితే ఇది కళ్ళల్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. పొరపాటున వెళ్ళిన నాలుగయిదుసార్లు కళ్ళను చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ మిశ్రమం వలన కనురెప్పలు దట్టంగా పెరుగుతాయి.
 
మస్కారాని అరుదుగా వాడడం మంచిది. మస్కారా వేసుకున్న తర్వాత దాన్ని తీసేయకుండా పడుకోకూడదు. బేబీ ఆయిల్‌తో దూది ముంచి జాగ్రత్తగా మస్కారాను తుడవడం మంచిది. ఇవి చేసే ఓపిక, తీరిక లేకపోతే మార్కెట్లో లభించే అర్టిఫిషియల్ రెప్పలు ఉపయోగించడమే మార్గం. వీటిని జాగ్రత్తగా అతికించిన తరువాత మీకున్న రెప్పలతో అవి కలిసిపోయే విధంగా మస్కారా వేయాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైనింగ్ టేబుల్ మెయిన్‌టెనెన్స్..?