Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్ళి దగ్గర్లోకి వచ్చాక.. ఇలా చేయకూడదు..?

పెళ్ళి దగ్గర్లోకి వచ్చాక.. ఇలా చేయకూడదు..?
, మంగళవారం, 29 జనవరి 2019 (10:54 IST)
పెళ్ళి ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైన ఘట్టం. అలాంటి అపురూప క్షణాల్లో నవ వధూవరలు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం. ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు భద్రంగా దాచుకుంటాం. అందుకే.. మళ్ళీ మళ్ళీ రాని పెళ్ళిరోజున వధువులు అందంగా, సౌందర్యరాశిగా మిలమిలా మెరిసిపోవాలంటే.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం...
 
పెళ్ళి ఆలోచన మొదలైనప్పట్నుంచే మగువలు తమ జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే చాలు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయాన్నే ఆలస్యంగా లేవడం మానుకోవాలి. అనవసరమైన విషయాలకు ఆందోళన చెందడం వంటివి మానేయాలి. మానసిక ప్రశాంతత చర్మాన్ని సైతం మెరిపిస్తుంది. 
 
పెళ్ళికి నాలుగైదు వారాల ముందే శిరోజాల విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మొదలుపెట్టాలి. కేశాలంకరణ ఎలా చేసుకుంటారో దానికి తగినట్టుగా మీ వెంట్రుకలను తీర్చిదిద్దుకోవాలి. హెయిర్ డ్రయ్యర్ వాడకూడదు. వారంలో ఒకటి రెండుసార్లు కండిషనర్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
 
రెండు రోజుల ముందు ఫేషియల్ చేసుకుంటే చాలా మంచిది. పెళ్ళికి ఒకరోజు ముందు మ్యానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవాలి. పెళ్ళి దగ్గర్లోకి వచ్చాక కొత్తగా మేకప్ వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ వాడకండి. వీటివలన తేడా వస్తే ఇంతవరకు పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్ట దగ్గరి కొవ్వు కరిగించాలంటే.. ఏం చేయాలి..?