Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మద్దతిస్తాం.. కాంగ్రెస్సా, బీజేపీనా అనవసరం: జగన్

Advertiesment
Andhra pradesh
, శనివారం, 2 మార్చి 2019 (15:33 IST)
ప్రముఖ జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తాపు. ప్రజల అభీష్టం మేరకు కాకుండా ఇష్టానికి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి హోదా ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చని బీజేపీలు రెండు రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్పారు. 
 
జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాలను ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేక హోదా ఇవ్వగా లేనిది పార్లమెంటు సాక్షిగా ఏపీకి హోదా ఇస్తామని ఇవ్వకపోవడమంటే ప్రజలను నమ్మించి మోసం చేయడమే అని జగన్ అన్నారు. పార్లమెంటు మీద నమ్మకం పెరగాలంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోక తప్పదని జగన్ చెప్పారు.
 
ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రాహుల్ వీరిద్దరిలో ఎవరిని శత్రువులుగా చూస్తారన్న ప్రశ్నకు జగన్ తెలివిగా సమాధానం చెప్పారు. ఇద్దరూ దొందూ దొందే అని అన్నారు. ఇప్పటికీ ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని అది కాంగ్రెస్ పార్టీనా లేక బీజేపీనా అనేది తమకు అనవసరమని జగన్ క్లారిటీ ఇచ్చారు. 
 
తాను కాంగ్రెస్‌తో ఉన్నంతవరకూ తనపై కేసుల్లేవని, కాంగ్రెస్‌ను వీడి బయటకువచ్చాక టీడీపీ కాంగ్రెస్‌వారే తనపై కేసులు పెట్టారని చెప్పారు. తన పిటిషనర్లు కూడా కాంగ్రెస్ టీడీపీకి చెందిన వారే అని జగన్ అన్నారు. తన తండ్రి ఉన్న సమయంలో కనీసం హైదరాబాదులో కూడా తను లేనని చెప్పిన జగన్... ఓటుకు నోటులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినప్పటికీ ఆయనపై ఎలాంటి కేసులు లేవని గుర్తు చేశారు. 
 
పాదయాత్ర చేయడం వల్లే రాష్ట్రంలోని చాలామంది ప్రజల ఇబ్బందులు తెలుసుకోగలిగానని చెప్పిన జగన్... తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ సెక్రటేరియట్‌లు పెట్టి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫీసులోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది.. ఎందుకంటే..?