ప్రముఖ కమెడియన్, నోటి దూలతో వివాదాల్లో చిక్కుకునే అలీ ప్రస్తుతం రాజకీయాల్లోకి రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణం అలీ జనసేన చీఫ్ పవన్‌ను కలవడం, ఆపై వైకాపా చీఫ్ జగన్‌ను కలవడమే. ఇలా వరుస భేటీలతో ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న అలీ.. తాజాగా తన రాజకీయ అరంగేట్రంపై నోరు విప్పారు.
ఏ పార్టీ తనకు మంత్రి పదవిని ఆఫర్ చేస్తుంటో ఆ పార్టీలో చేరుతానని అలీ స్పష్టం చేశారు. తాను టీడీపీలో వున్నట్లు పవన్‌కు తెలుసునని.. గతంలో ఎన్నికల సందర్భంగా టిక్కెట్ ఇస్తున్నారా.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా అని పవన్ అడిగారని గుర్తు చేసుకున్నాడు.
అలాగే జనసేనలో చేరే అంశంపై అలీ మాట్లాడుతూ.. జనసేనలోకి రమ్మని పవన్ కల్యాణ్ పిలవలేదు. తాను వెళ్లలేదన్నారు. పవన్ పార్టీ పెట్టే విషయం తనకు ముందే తెలుసు. కానీ పవన్ ఈ విషయాన్ని నేరుగా తనతో ప్రస్తావించలేదు. పవన్ పార్టీ పెట్టాక ఆయన్ను కలవలేదు.
జనసేన తరపున పనిచేయమని ఆయన తనను అడగలేదు. ఆయన వల్ల తనకు ఇబ్బంది కలుగుతందనే ఆలోచనతో పవన్ తనను అడిగివుండరు. తన సొంత మనుషులకు పవన్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టరని.. అందుకే తాను వెళ్లలేదని అలీ జవాబిచ్చారు.